|  
● FLASH NEWS
Balapur: బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త రికార్డ్.. ఏకంగా రూ.39 లక్షలు పలికిన ప్రసాదం  •  ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత్.. ఆసియా క్రీడల్లో మరో పతకం ఖాయం!  •  Hockey: ఏషియన్ గేమ్స్‌లో జపాన్‌పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు  •  Hyderabad : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా సురేష్ గౌడ్ నియామకం  •  Supreme Court : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్..  • 
Skip to content

స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్: 15వ వెడ్డింగ్ యానివర్సరీ సర్ప్రైజ్ మామూలుగా లేదుగా

టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి తమ వైవాహిక జీవితంలో 15 ఏళ్ల మైలురాయిని చేరుకున్నారు. 2011 మార్చి 6న వివాహం చేసుకున్న ఈ జంట, 15 ఏళ్ల ప్రేమానుబంధాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ తన భార్యకు ఒక ఖరీదైన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కోటిన్నర విలువైన లగ్జరీ కార్ గిఫ్ట్

తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ తన ప్రియ సతీమణి స్నేహా రెడ్డికి సుమారు 1.5 కోట్ల రూపాయల విలువైన ‘మెర్సిడెస్-ఏఎంజి సిఎల్ఈ 53’ (Mercedes-AMG CLE 53) లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. గ్యారేజీలో అందంగా అలంకరించిన ఈ కారు తాళాలను అల్లు అరవింద్, పిల్లలు అయాన్ మరియు అర్హల సమక్షంలో బన్నీ తన భార్యకు అందించారు. ఈ సందర్భంగా స్నేహ తన భర్తకు ప్రేమతో ముద్దు పెట్టి ధన్యవాదాలు తెలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

​”నువ్వు లేకుండా ఈ ప్రయాణం సాధ్యం కాదు”కేవలం గిఫ్ట్ తోనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. “హ్యాపీ యానివర్సరీ క్యూటీ. 15 ఏళ్ల కలిసి ప్రయాణం. నువ్వు లేకుండా ఈ ప్రయాణం ఇలా ఉండేది కాదు” అంటూ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. అల్లు శిరీష్ వివాహం కూడా అదే రోజున జరగడంతో అల్లు కుటుంబంలో డబుల్ సెలబ్రేషన్స్ నెలకొన్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp