|   
🔴 BREAKING NEWS ► AP Job Calendar 2026 : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల అనకాపల్లిని దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు Nalgonda News : చండూరు మార్కెట్ యార్డుకు కన్నం.. 1100 బస్తాల ప్రభుత్వ ధాన్యం లూటీ BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక!
Skip to content

బడుగుల రాజ్యాధికారమే లక్ష్యం : తీన్మార్ మల్లన్న, భరత్ నగర్‌లో టీఆర్పీ శంఖారావం

కూకట్పల్లి, సూర్య న్యూస్ : కూకట్పల్లి నియోజకవర్గంలోని ముసపేట భరత్ నగర్ ప్రాంతంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. స్థానిక నాయకుడు మేడ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భరత్ నగర్ ప్రాంతంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు, కూలీలు, రైతులు మరియు యువత హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన రాజకీయ అవకాశాలు కల్పించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాజకీయ మార్పు ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని, ఆ మార్పుకు TRP బలమైన వేదికగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రతి కాలనీ మరియు బస్తీ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని వెల్లడించారు.

​ఈ సందర్భంగా ముసపేట డివిజన్ నుండి పెద్ద ఎత్తున యువత, స్థానిక ప్రజలు తీన్మార్ మల్లన్న సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న, స్వయంగా కార్యకర్తలకు, ప్రజలకు భోజనాలు వడ్డించి వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో TRP వర్కింగ్ ప్రెసిడెంట్ హరి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఓదెలు యాదవ్, బొడ్డుపల్లి చంద్రశేఖర్, రమేష్ యాదవ్, రాజు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp