|   
🔴 BREAKING NEWS ► Bandi Bhagirath Bail : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు US President Trump : ఇరాన్ కు డేంజర్ వార్నింగ్.. ఖార్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ సంచలన ప్రకటన Prashna Ravan Arrest : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు Pawan Kalyan Fan Niranjan Death : కన్నీరు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్ వీరాభిమాని మృతి.. ‘ఓజీ 2’ చూద్దామనుకున్నాడు అంతలోనే తీవ్ర విషాదం TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
Skip to content

అన్యాయాన్ని ప్రశ్నించడమే భగత్ సింగ్ కు ఇచ్చే ఘనమైన నివాళి: సిపిఐ నేత ఉమా మహేష్

జగద్గిరిగుట్ట, సూర్య న్యూస్ : సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఎదిరించడమే స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ (Bhagat Singh) కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ స్పష్టం చేశారు, భగత్ సింగ్ మరియు రాజ్ గురు అలాగే సుఖ్ దేవ్ ల 95 వ వర్ధంతిని (Death Anniversary) పురస్కరించుకుని జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ (Bus Stop) మరియు భగత్ సింగ్ మార్గ్ లో ఉన్న భగత్ సింగ్ విగ్రహాలకు సిపిఐ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా ఉమా మహేష్ మాట్లాడుతూ నేటి యువత కుల మత రాజకీయాలకు అతీతంగా భగత్ సింగ్ ఆశించిన సమసమాజ నిర్మాణం కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు, దేశ సహజ సంపదలు ప్రజలకే చెందాలని మరియు ఎవరూ దోపిడీకి గురికాకుండా సమానత్వంతో బతకాలని నూనూగు మీసాల వయసులోనే ఉరితాడును ముద్దాడిన గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్ అని ఆయన గుర్తు చేశారు, ఎటువంటి త్యాగాలు చేయకుండా బ్రిటిష్ వారి కోసం పనిచేసిన సావర్కర్ లాంటి వారిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొంటూ కొమరం భీమ్, ఛత్రపతి శివాజీ, అష్ఫాకుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్ మరియు సుభాష్ చంద్రబోస్ లాంటి వీరుల చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులు మరియు మేధావులపై ఉందని ఆయన అన్నారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ప్రజలు మూఢత్వంలో మునిగి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతే మరోసారి బానిసలుగా మారే ప్రమాదం ఉందని కావున విప్లవ వీరుల చరిత్రను ప్రజలకు తెలియజేయాలని ఆయన హెచ్చరించారు, సిపిఐ (CPI) మండల కార్యదర్శి కే స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, ఏఐటీయూసీ (AITUC) జిల్లా కార్యదర్శి వి శ్రీనివాస్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, శాఖా కార్యదర్శులు సహదేవ రెడ్డి, నరసింహారెడ్డి, రవి అలాగే యువజన సంఘం నాయకులు మజ్జి గౌరీ, మారెప్ప, సోమయ్య, సామెల్, ఆశప్ప ఇమామ్, బాబు తదితరులు పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp