|   
🔴 BREAKING NEWS ► Bandi Bhagirath Bail : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు US President Trump : ఇరాన్ కు డేంజర్ వార్నింగ్.. ఖార్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ సంచలన ప్రకటన Prashna Ravan Arrest : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు Pawan Kalyan Fan Niranjan Death : కన్నీరు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్ వీరాభిమాని మృతి.. ‘ఓజీ 2’ చూద్దామనుకున్నాడు అంతలోనే తీవ్ర విషాదం TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
Skip to content

చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: నాగబాబు భరోసా

కోవాబన్ విక్రేతకు రూ. 25 వేల ఆర్థిక సాయం.. దాడులు చేయడం సరికాదని హితవు

అమరావతి: పొట్టకూటి కోసం కష్టపడే చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ భరోసాగా ఉంటుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. కోవాబన్ అమ్ముకునే సాధారణ పౌరుడిని కొందరు భయభ్రాంతులకు గురిచేయడం దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు చిరువ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

బాధిత వ్యాపారికి అండగా:

ఈ సంఘటన కారణంగా శివరాత్రి పర్వదినాన వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని బాధిత వ్యాపారి వలి ఆవేదన వ్యక్తం చేయగా, నాగబాబు స్పందించి వ్యక్తిగతంగా రూ. 25,000 ఆర్థిక సహాయం అందించారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారని, ఏదైనా సందేహం ఉంటే అధికారులను సంప్రదించాలి తప్ప దాడులు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.

మతం కోణంలో చూడొద్దు:

ఈ సంఘటనను మతం కోణంలో చూడవద్దని నాగబాబు కోరారు. తక్కువ లాభంతో కుటుంబాలను పోషించుకునే చిరువ్యాపారులపై జరిగిన ఈ దాడిని ఐటీ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 40 శాతానికి పైగా పేద ప్రజలు చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాలపైనే ఆధారపడతారని, వారి పొట్ట కొట్టడం మంచి పరిణామం కాదని ఆయన హెచ్చరించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp