|   
🔴 BREAKING NEWS ► BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే
Skip to content

Maharashtra Epstein Files : మహారాష్ట్ర ఎప్స్టీన్ ఫైల్స్.. మర్చంట్ నేవీ టూ ‘మోసగాడు’.. అశోక్ ఖారత్ వందల కోట్ల కామ సామ్రాజ్యం వెనుక రాజకీయ అండదండలు!

ముంబై, సూర్య న్యూస్: ఆధ్యాత్మికత పేరుతో అమాయక మహిళల జీవితాలతో ఆడుకున్న ఒక కామ పిశాచి ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నాషిక్ (Nashik) కేంద్రంగా ‘గోడ్‌మ్యాన్’ అవతారమెత్తిన అశోక్ ఖారత్ (Ashok Kharat) సాగించిన అకృత్యాలు వెలుగులోకి రావడంతో దీనిని ‘మహారాష్ట్ర ఎప్స్టీన్ ఫైల్స్’ (Maharashtra Epstein Files) గా పోలీసులు అభివర్ణిస్తున్నారు.

నేవీ ఆఫీసర్ నుండి నకిలీ బాబా వరకు :

అశోక్ ఖారత్ నేపథ్యం పరిశీలిస్తే, అతను గతంలో మర్చంట్ నేవీ (Merchant Navy) లో పనిచేశాడు. అందుకే తనను తాను ‘కెప్టెన్’ అని పిలుచుకునేవాడు. రిటైర్మెంట్ తర్వాత జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంపై పట్టు సాధించి నాషిక్‌లోని కెనడా కార్నర్ వద్ద తన కార్యాలయాన్ని ప్రారంభించాడు. కేవలం జ్యోతిష్యుడిగా మొదలై, అతి తక్కువ కాలంలోనే సిద్ధాశ్రమం పేరుతో ఒక పెద్ద ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. తనకున్న ‘కెప్టెన్’ టోపీ, కాషాయ వస్త్రాల ముసుగులో ఉన్నత వర్గాల ప్రజలను ఆకర్షించి, వారి బలహీనతలను తన పెట్టుబడిగా మార్చుకున్నాడు.​

రాజకీయ అండదండలతో అరాచకాలు :

అశోక్ ఖారత్ ఇంతటి సాహసానికి ఒడిగట్టడానికి ప్రధాన కారణం అతనికి ఉన్న రాజకీయ పలుకుబడి. మహారాష్ట్రలోని అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు కీలక నేతలతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉండేవని విచారణలో తేలింది. రాజకీయ రక్షణ ఉన్నప్పుడు ఏ వ్యవస్థ కూడా తనను తాకలేదనే తెగింపుతో, మహిళలను లోబరుచుకోవడం, వారిపై అత్యాచారం చేయడం మరియు వారిని అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడం వంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. నాషిక్ లోని ఈశాన్యేశ్వర ఆలయం (Ishanyeshwar Temple) ఇతని చీకటి కార్యకలాపాలకు అడ్డాగా మారింది.

​58 వీడియోల వెనుక భయంకర నిజాలు :

నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ (Pen Drive) లో ఏకంగా 58 అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. అమెరికాలో జెఫ్రీ ఎప్స్టీన్ ఏ విధంగా అయితే తన రాజకీయ పరపతితో అత్యున్నత వర్గాల మహిళలను వేధించాడో, ఖారత్ కూడా అదే తరహాలో ‘మహారాష్ట్ర ఎప్స్టీన్’ గా ఎదిగాడు. ఐపిఎస్ అధికారిణి తేజస్విని సత్పుతే (Tejaswi Satpute IPS) నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం (SIT) విచారణలో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా దృష్టి సారించింది. సమాజంలో భక్తి ముసుగులో ఉన్న ఇలాంటి కీచకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp