|   
🔴 BREAKING NEWS ► Bandi Bhagirath Bail : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు US President Trump : ఇరాన్ కు డేంజర్ వార్నింగ్.. ఖార్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ సంచలన ప్రకటన Prashna Ravan Arrest : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు Pawan Kalyan Fan Niranjan Death : కన్నీరు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్ వీరాభిమాని మృతి.. ‘ఓజీ 2’ చూద్దామనుకున్నాడు అంతలోనే తీవ్ర విషాదం TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
Skip to content

Teenmar Mallanna : బీసీ కాంట్రాక్టర్ల మహా ధర్నాకు తీన్మార్ మల్లన్న సంపూర్ణ మద్దతు.. ఏప్రిల్ 8న చలో ధర్నా చౌక్!

హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 8వ తేదీన హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించబోయే ‘బీసీ కాంట్రాక్టర్ల గర్జన’కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శనివారం పార్టీ కార్యాలయంలో బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (TBCCA) నాయకులు మల్లన్నను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ప్రభుత్వం నుండి రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడంతో తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం :

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంచడం వల్ల బీసీ కాంట్రాక్టర్లు ఆర్థికంగా కుదేలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీ కాంట్రాక్టర్లకు 42 శాతం కాంట్రాక్టులు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ మాట తప్పడం బీసీ వర్గాల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటాను తక్షణమే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏప్రిల్ 8న స్వయంగా హాజరు :

బీసీ కాంట్రాక్టర్ల హక్కుల కోసం జరిగే ఈ పోరాటంలో తాను ముందుంటానని మల్లన్న హామీ ఇచ్చారు. ఏప్రిల్ 8వ తేదీన జరగబోయే మహా ధర్నా కార్యక్రమానికి తాను స్వయంగా హాజరవుతానని ప్రకటిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ కాంట్రాక్టర్లు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. “బీసీ కాంట్రాక్టర్లకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు” అని ఆయన స్పష్టం చేశారు.

పాల్గొన్న నాయకులు :

ఈ కార్యక్రమంలో బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, సభ్యులతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp