Skip to content
Home » Thalapathy Vijay : దళపతి విజయ్ దళితుడా.. ఆయన కులం, మతం, హైదరాబాద్ లింక్స్ వెనుక ఉన్న అసలు నిజాలు ఇవే..

Thalapathy Vijay : దళపతి విజయ్ దళితుడా.. ఆయన కులం, మతం, హైదరాబాద్ లింక్స్ వెనుక ఉన్న అసలు నిజాలు ఇవే..

చెన్నై, సూర్య న్యూస్: ​తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న దళపతి విజయ్ (Thalapathy Vijay) వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన దళితుడు అని, ఆయన మూలాలు ఎక్కడ ఉన్నాయో అంటూ సోషల్ మీడియా (Social Media) లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కులం, మతం, కుటుంబ నేపథ్యం గురించి వాస్తవాలు బయటకు వచ్చాయి.

​విజయ్ దళితుడు కాదు. ఆయన కుటుంబం వెల్లలార్ కమ్యూనిటీ (Vellalar Community) కి చెందింది. ఇది తమిళనాడు, కేరళ, శ్రీలంక (Sri Lanka) ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఒకప్పటి అగ్రవర్ణం. వీరు ప్రధానంగా భూస్వామ్య సామాజిక వర్గం. చోళుల కాలంలో వీరు పరిపాలన, మిలిటరీ విభాగాల్లో కీలక పాత్ర పోషించేవారు. కాలక్రమేణా ఈ సామాజిక వర్గంలోని పలు ఉపకులాలు బీసీ జాబితా (BC List) లోకి చేరాయి. విజయ్ ఉడియార్ ఉపకులానికి చెందినవారు. విజయ్ తాత ఎస్.ఎన్. చంద్రశేఖరన్ శ్రీలంకలో జన్మించారు. ఆ తర్వాత వారు రామనాథపురం వలస వచ్చారు. వీరు క్రైస్తవ మతాన్ని (Christianity) స్వీకరించిన వెల్లలార్స్.

విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ (S.A. Chandrasekhar) చెన్నై వచ్చి సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా స్థిరపడ్డారు. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. విజయ్ తల్లి శోభ (Shoba) హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. వీరి కుటుంబం హైదరాబాద్ (Hyderabad) నుంచి చెన్నైకి వలస వెళ్లింది. ప్రముఖ సింగర్ ఎస్.ఎన్. సురేందర్ ఈమె సోదరుడే. తల్లి వైపు నుంచి విజయ్ కు హైదరాబాద్ తో బంధుత్వం ఉంది.

విజయ్ తండ్రి తన కొడుకు పేరును విజయ్ జోసెఫ్ (Vijay Joseph) అని పెట్టినా, స్కూల్ రికార్డుల్లో మాత్రం కులం రాయించలేదు. కేవలం తమిళియన్ (Tamilian) అని మాత్రమే నమోదు చేశారు. 1999లో సంగీతను వివాహం చేసుకున్న విజయ్, ఇప్పుడు విడాకుల (Divorce) దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటి త్రిషతో (Actress Trisha) సాన్నిహిత్యం వల్లే ఈ విడాకులు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. అధికారికంగా ఇంకా విడాకులు మంజూరు కాలేదు.

మొత్తంగా చూస్తే విజయ్ మూలాలు శ్రీలంకలో ఉన్నాయి. ఆయన తండ్రి వైపు క్రిస్టియన్ భూస్వామ్య వర్గం కాగా, తల్లి వైపు హిందూ కుటుంబం. కాబట్టి ఆయన దళిత క్రిస్టియన్ అనే ప్రచారం కేవలం వదంతులు మాత్రమే.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.