|  
● FLASH NEWS
Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  •  Deal: పరస్పర సుంకాల తగ్గింపునకు అమెరికా-చైనా అంగీకారం  •  Strike: బ్యాంకుల సమ్మె వాయిదా.. యూనియన్లపై ఉద్యోగుల ఆగ్రహం  •  Kohli: కోహ్లీ–గిల్ సెంచరీలు.. వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం  •  CEC: దేశద్రోహి జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్  • 
Skip to content

Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపు.. ఆగిపోయిన విజయ్ ప్రమాణ స్వీకారం.. అధికారం కోసం కలుస్తున్న బద్ధ శత్రువులు?

చెన్నై, సూర్య న్యూస్:​ తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu Politics) రసవత్తరంగా మారాయి. ఊహించని మలుపులతో రోజుకో కొత్త ట్విస్ట్ తెరమీదకు వస్తోంది. తాజాగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా బద్ధ శత్రువులైన డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) మధ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ సాధించడంలో వెనుకబడిన టీవీకే (TVK) అధినేత విజయ్ (Vijay) కు గవర్నర్ ఊహించని షాక్ ఇచ్చారు. తగినంత బలం లేని కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయనకు గవర్నర్ అనుమతి నిరాకరించారు.

​ఈ పరిణామంతో రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయింది. తమిళనాడులో (Tamil Nadu) ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 118గా ఉంది. ప్రస్తుతం టీవీకే కు కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. వీరితో కలుపుకుని విజయ్ కు ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. కానీ అధికారం చేపట్టాలంటే కచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బలం నిరూపించుకోలేకపోవడంతో గవర్నర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కు 59 సీట్లు రాగా, అన్నాడీఎంకే కు 47 సీట్లు వచ్చాయి. వామపక్షాలు మరియు ఐయూఎంఎల్ పార్టీలు డీఎంకే కూటమిలోనే ఉన్నాయి. కూటమిలోని సీపీఎం (CPM) కు రెండు, సీపీఐ (CPI) కు రెండు, ఐయూఎంఎల్ (IUML) కు రెండు సీట్లు దక్కాయి. గవర్నర్ నిర్ణయంతో అధికార పీఠం దక్కించుకునేందుకు డీఎంకే మరియు అన్నాడీఎంకే పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న చర్చలు తమిళ రాజకీయాల్లో (Tamil Politics) ఒక్కసారిగా హీట్ పెంచేశాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp