|  
● FLASH NEWS
Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  •  EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  • 
Skip to content

Manchu Manoj : మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకల్లో కీలక ఘట్టం.. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఏమన్నారంటే?

హైదరాబాద్, సూర్య న్యూస్ :​ తెలుగు సినీ హీరో (Tollywood Actor) మంచు మనోజ్ (Manchu Manoj) పుట్టినరోజు సందర్భంగా కూకట్ పల్లిలో (Kukatpally) భారీ రక్తదాన శిబిరం జరిగింది. మే 20న ఆయన జన్మదినం ఉన్న నేపథ్యంలో అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేపీహెచ్‌బీలోని (KPHB) ఒక ఫంక్షన్ హాల్ లో మంచు మనోజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ (Fans Association) ఆధ్వర్యంలో భవాని చౌదరి, సత్తార్ ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సామాజిక కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే (Jubilee Hills MLA) వి. నవీన్ యాదవ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వి. చిన్న శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ (Naveen Yadav) మాట్లాడుతూ మంచు మనోజ్ దంపతుల సేవలను కొనియాడారు. మంచు మనోజ్, భూమా మౌనిక (Bhuma Mounika) నిర్వహిస్తున్న ఐక్య ఫౌండేషన్ (AIKYA Foundation) భవిష్యత్తులో మరింత మందికి సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. పేదలకు సహాయం చేయాలనే భూమా మౌనిక సేవా భావాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంచు మనోజ్ ను శాలువాతో సత్కరించి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes) తెలియజేశారు.

అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం (Blood Donation) చేయడం మానవత్వానికి నిదర్శనం అని అతిధులు ప్రశంసించారు. యువత ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని ఎమ్మెల్యే అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో స్థానిక కాంగ్రెస్ (Congress) పార్టీ నాయకులు, సినీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp