|  
● FLASH NEWS
Konda Surekha: మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు.. అనుచరులపై ఈగవాలినా ఊరుకోం  •  AsianGames: ట్రాక్‌పై భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన.. ఖాతాలో మరో స్వర్ణం  •  PawanKalyan: వైసీపీ పాలనలో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి  •  AP Liquor: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం నాణ్యత తెలుసుకోండి  •  Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  • 
Skip to content

Vaibhav Sooryavanshi Debut : సచిన్ నుంచి రోహిత్ వరకు.. తొలి మ్యాచ్‌లోనే 15 ఏళ్ల కుర్రాడి టార్గెట్స్ ఇవే ?

Hyderabad, Surya News: ఐపీఎల్ (IPL) వేదికగా పరుగుల సునామీ సృష్టించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఇప్పుడు అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. జూన్ 26 నుంచి బెల్ ఫాస్ట్ (Belfast) వేదికగా ఐర్లాండ్ తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ టీమిండియా (Team India) తరపున అరంగేట్రం చేయబోతున్నాడు. తొలి మ్యాచ్ లోనే వైభవ్ ఐదు భారీ రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ (Civil Service Cricket Club) మైదానంలో ఈ కుర్రాడి ఆటను ప్రత్యక్షంగా చూడటానికి ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఏకంగా మైదానంలో తాత్కాలిక స్టాండ్లను నిర్మిస్తోంది.

సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డుకు ముప్పు పొంచి ఉంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రికార్డు ఇప్పటివరకు సచిన్ పేరిట ఉంది. సచిన్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో భారత జట్టు తరపున తొలి మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు 15 ఏళ్ల వయసులో బరిలోకి దిగుతున్న వైభవ్ ఆ మూడు దశాబ్దాల నాటి రికార్డును బ్రేక్ చేయనున్నాడు.

అరంగేట్రంలోనే సిక్సర్ల సునామీ సృష్టించే అవకాశం ఉంది. టీ20 అరంగేట్ర మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు (4 సిక్సర్లు) బాదిన రికార్డు ఇషాన్ కిషన్ (Ishan Kishan) పేరిట ఉంది. క్లీన్ హిట్టింగ్ కు మారుపేరైన వైభవ్ ఈ మ్యాచ్ లో ఐదు సిక్సర్లు బాదితే కిషన్ రికార్డును అధిగమిస్తాడు.

అజింక్య రహానే (Ajinkya Rahane) పరుగుల రికార్డుపై కూడా వైభవ్ గురి పెట్టాడు. 2011లో ఇంగ్లాండ్ పై అరంగేట్రం చేసిన రహానే 39 బంతుల్లో 61 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ కనుక 62 పరుగులు చేయగలిగితే 15 ఏళ్ల వయసులోనే ఆ పాత రికార్డును తుడిచిపెడతాడు.

ఐర్లాండ్ గడ్డపై సరికొత్త రికార్డు నమోదు కానుంది. ఐర్లాండ్ లో అరంగేట్రం చేసిన సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్, ప్రసిద్ధ్ కృష్ణ, రింకూ సింగ్ తమ తొలి మ్యాచ్ లో కనీసం ఒక్క పరుగు కూడా చేయలేదు. వైభవ్ కేవలం ఒక్క పరుగు చేసినా ఐర్లాండ్ గడ్డపై అరంగేట్రం చేసి పరుగుల ఖాతా తెరిచిన తొలి భారతీయ బ్యాటర్ గా నిలుస్తాడు.

రోహిత్ శర్మ (Rohit Sharma) రికార్డుకు కూడా ఎసరు రానుంది. ఐర్లాండ్ గడ్డపై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్ గా రోహిత్ (97 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఓపెనర్ గా బరిలోకి దిగి 98 పరుగులు సాధిస్తే ఏకంగా రోహిత్ రికార్డు బద్దలు అవుతుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp