|   
🔴 BREAKING NEWS ► Palamuru University Guest Faculty Recruitment : పాలమూరు యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి ఇలా! Akhil Akkineni Movie Hit : అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మూవీ సక్సెస్.. తండ్రి నాగార్జున కాళ్లపై పడి ఎమోషనల్! Bandi Bhagirath Bail : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు US President Trump : ఇరాన్ కు డేంజర్ వార్నింగ్.. ఖార్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ సంచలన ప్రకటన Prashna Ravan Arrest : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు
Skip to content

Mudragada Padmanabham Death : కాపు ఉద్యమ శిఖరం నేలకొరిగింది.. ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాకినాడ, సూర్య న్యూస్ : కాపు ఉద్యమ నేత (Kapu Leader), మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం గత నెల 16న హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో సింధు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. బుధవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం కిర్లంపూడికి (Kirlampudi) తరలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ముద్రగడ కుటుంబ నేపథ్యం ఇదే..​

ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ఆయనకు భార్య పద్మావతి, కుమారులు బాలూ, గిరిబాబు, కుమార్తె క్రాంతి ఉన్నారు. ఆయన తండ్రి వీర రాఘవరావు ప్రత్తిపాడు నుంచి రెండుసార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రి ఆకస్మిక మరణంతో 25 ఏళ్ల వయసులోనే ముద్రగడ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం..​

తన రాజకీయ జీవితంలో ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా సేవలందించారు. 1978లో తొలిసారి జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి కేబినెట్లలో ఆయన మంత్రిగా పనిచేశారు. 1999లో టీడీపీ తరపున కాకినాడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 తర్వాత ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన, 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.

​కాపు రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం..​

కాపులను బీసీల్లో (BC Category) చేర్చాలని ముద్రగడ సుదీర్ఘ కాలం పోరాటం చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం ఏకంగా ఏడుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. 2016లో తుని వేదికగా ఆయన నిర్వహించిన కాపు ఐక్య గర్జన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పవన్‌పై సవాల్.. పేరు మార్పు..

​2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడిన ముద్రగడ, 2024 జూన్ 20న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.

ప్రముఖుల తీవ్ర సంతాపం..​

ముద్రగడ మరణవార్త పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పేర్కొన్నారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్ ప్రార్థించారు. కాపు సామాజిక వర్గానికి ఆయన పెద్దదిక్కుగా నిలిచారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన సంతాప సందేశంలో కొనియాడారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp