|   
🔴 BREAKING NEWS ► Bandi Bhagirath Bail : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు US President Trump : ఇరాన్ కు డేంజర్ వార్నింగ్.. ఖార్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ సంచలన ప్రకటన Prashna Ravan Arrest : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు Pawan Kalyan Fan Niranjan Death : కన్నీరు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్ వీరాభిమాని మృతి.. ‘ఓజీ 2’ చూద్దామనుకున్నాడు అంతలోనే తీవ్ర విషాదం TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
Skip to content

కాంగ్రెస్ సర్కార్ కు కేటీఆర్ అల్టిమేటం: బడ్జెట్ లో హామీలకు నిధులు కేటాయించకపోతే నిలదీస్తాం

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటైన బహిరంగ లేఖ రాశారు. 2026-2027 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు మరియు 420 హామీల అమలు కోసం తగిన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీలలో 95 శాతం పెండింగ్ లోనే ఉన్నాయని కేటీఆర్ ఈ లేఖలో ఎండగట్టారు.

ప్రతి వర్గాన్ని మోసం చేశారు

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని కేటీఆర్ విమర్శించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ 2500 వృద్ధులు మరియు వితంతువులకు రూ 4000 పెన్షన్ నిరుద్యోగులకు భృతి వంటి హామీలకు ఈ బడ్జెట్ లోనైనా నిధులు కేటాయించాలని కోరారు. రైతుబంధు బకాయిలు చెల్లించడంతో పాటు రైతు కూలీలకు ఇస్తానన్న రూ 12 వేల ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజల పక్షాన పోరాటం తప్పదు

డిక్లరేషన్ల పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈసారి కూడా బడ్జెట్ లో కేటాయింపులు చేయకపోతే తెలంగాణ సమాజం ఇక ఓపిక పట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. హామీల అమలుకు బడ్జెట్ లో నిధులు చూపకపోతే ఎక్కడికక్కడ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని మరియు ప్రజల పక్షాన నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp