|  
FLASH NEWS
NSA Ajit Doval : నా కెరీర్ అక్కడితో ముగిసిందనుకున్నా.. తన ఏజెంట్లను చైనా బంధించిన నాటి ఘటనపై అజిత్ దోవల్!  •  మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!  •  Pawan Kalyan Health Update : ముగిసిన ఆయుర్వేద వైద్యం.. నెల రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన పవన్!  •  Kakinada Port : కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. రూ.65 లక్షల సరుకు సీజ్  •  Vijayawada Crime News : సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం.. సిట్ రిమాండ్ రిపోర్టులో దారుణ విషయాలు!  • 
Skip to content

BRAOU MBA Admissions 2026 : అంబేద్కర్ వర్సిటీ ఎంబీఏ దరఖాస్తులకు ముగుస్తున్న గడువు… చివరి తేదీ ఎప్పుడో తెలుసా?

Hyderabad, Surya News: డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Dr B.R. Ambedkar Open University) ఎంబీఏ (MBA), అలాగే ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష (Entrance Exam) కోసం దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్సిటీ పీఆర్ఓ (PRO) డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ కోర్సుల్లో చేరాలంటే అభ్యర్థులు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ (SC), ఎస్టీ (ST) అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఈ ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే తెలంగాణ ఐసెట్ (Telangana ICET) లో కానీ, లేదా ఓపెన్ యూనివర్సిటీ స్వయంగా నిర్వహించే బ్రౌసెట్ (BRAOUCET) ప్రవేశ పరీక్షలో కానీ తప్పనిసరిగా అర్హత సాధించాలి. యూనివర్సిటీ క్యాంపస్‌లో జనరల్ ఎంబీఏలో చేరాలన్నా ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సిందే.

​ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నేర్చుకునే అద్భుత అవకాశం లభిస్తుంది. అపోలో హాస్పిటల్ (Apollo Hospital), కిమ్స్ (KIMS), డెక్కన్ మెడికల్ కాలేజ్, ఆర్వీఎం హాస్పిటల్ (RVM Hospital), రినోవా హాస్పిటల్ (Renovo Hospital) వంటి ప్రముఖ సంస్థల్లో ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేయడానికి అడ్మిషన్ పొందవచ్చు. దరఖాస్తులు మరియు ఇతర వివరాల కోసం 040-23680333 లేదా 040-23680555 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. అలాగే అధికారిక వెబ్‌సైట్ www.braouonline.in ద్వారా పూర్తి సమాచారం పొందవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp