
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని రామాలయంలో భవ్య శ్రీ రామకథ 2026 కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది ఈ ఆధ్యాత్మిక వేడుకకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రామకథా ప్రవచనాలకు నియోజకవర్గంలోని భక్తులు వేలాదిగా తరలివచ్చి పునీతులవుతున్నారు

రామకథా విశిష్టతను వివరించిన గణేష్ మహారాజ్
వారణాసికి చెందిన ప్రముఖ ప్రవచనకర్త పరమ పూజ్య శ్రీ గణేష్ మహారాజ్ ఈ సందర్భంగా రామకథ యొక్క ప్రాశస్త్యాన్ని భక్తులకు కళ్ళకు కట్టినట్లు వివరించారు భగవంతుని నామస్మరణతో ఇస్నాపూర్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు

భారీగా తరలివచ్చిన ప్రముఖులు మరియు భక్తులు
ఈ వేడుకలో పటాన్చెరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్.. సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి.. ఉత్తర భారతీయ సంక్షేమ సంఘం ప్రతినిధులు సంజయ్ కుమార్ సింగ్.. సునీల్ కుమార్ సింగ్.. టింకు పటేల్.. రమేష్ యాదవ్.. ప్రిన్స్ సింగ్.. రాకేష్ చౌబే.. శ్యామ్ సుందర్.. గుప్తాజీ సంతోష్ సింగ్ పాల్గొన్నారు శ్రీ రామ సేవా సదన్ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ సింగ్ సుమన్ ఆధ్వర్యంలో భక్తులందరికీ తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది