|  
FLASH NEWS
Indian Army : రూ.46 లక్షల అమెజాన్ ప్యాకేజీ వదిలేసి సైన్యంలోకి.. నువ్వు గ్రేట్ గురూ!  •  వెనక్కి తగ్గిన రాజగోపాల్ రెడ్డి? నకిరేకల్ సీఎం సభకు హాజరు..  •  తెలుగు వర్సిటీ జర్నలిజం విద్యార్థుల వినూత్న ప్రయత్నం.. నేడు ‘గురుదక్షిణ’ కవితా సంకలనం ఆవిష్కరణ  •  Giorgia Meloni : యుద్ధానంతర ఇటలీ చరిత్రలో జార్జియా మెలోనీ అరుదైన రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు  •  ISRO EOS-08 : ఇస్రో మరో అద్భుతం.. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3  • 
Skip to content

ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయిపై కేసు నమోదు.. పోలీసుల గాలింపు

పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులకు తోటి డాన్సర్ మాధురి రాథోడ్ ఫిర్యాదు

పరారీలో ఉన్న నిందితుడి కోసం రెండు ప్రత్యేక బృందాలతో పోలీసుల అన్వేషణ

folk dancer eshwar sai featured image
folk dancer eshwar sai featured image

హైదరాబాద్, సూర్య న్యూస్: ప్రముఖ ఫోక్ డాన్సర్, ‘బాసింగ బలాలు’ ఫేమ్ ఈశ్వర్ సాయిపై పోలీసు కేసు నమోదైంది. పెళ్లి పేరుతో నమ్మించి తనను మోసం చేశాడంటూ తోటి డాన్సర్ మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మాధురి రాథోడ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు ఆరోపణలు చేశారు. ఈశ్వర్ సాయి తనను వివాహం చేసుకుంటానని నమ్మించాడని, ఆ పేరుతో శారీరకంగా వాడుకుని చివరకు మోసానికి పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వంచించిన అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.

ముమ్మరంగా దర్యాప్తు

ఫిర్యాదు స్వీకరించిన నార్సింగి పోలీసులు వెంటనే స్పందించి ఈశ్వర్ సాయిపై కేసు నమోదు చేశారు. అయితే, కేసు వ్యవహారం బయటకు రావడంతో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు, అతడి ఆచూకీ కనిపెట్టేందుకు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు ఈశ్వర్ సాయి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp