|  
● FLASH NEWS
Supreme: వారసత్వ ఆస్తిలో మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు  •  Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  •  MEIL: వాటర్ సప్లై ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు.. ఆంధ్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  •  Jobs: కేంద్ర అణుశక్తి శాఖలో 254 టీచర్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో  •  Supreme: ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలు కస్టడీలో ఉంటే సస్పెండ్ అయినట్లే: సుప్రీంకోర్టు  • 
Skip to content

ఖాజాగూడ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కుమారుడు అరెస్ట్

Art director anand sai son
Art director anand sai son

హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్‌లోని ఖాజాగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం (హిట్ అండ్ రన్) కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదానికి కారణమైన అనంతరం పరారీలో ఉన్న అతడిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ ప్రమాదం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నందూలాల్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో ఆయన గాయపడ్డారు. అదే సమయంలో అక్కడే ఉన్న జైద్ షా అనే వ్యక్తి స్పందించి, గాయపడిన నందూలాల్‌ను తన కారులో ఎక్కిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది.

సరిగ్గా అదే సమయంలో వేగంగా వచ్చిన సందీప్ కారు వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నందూలాల్ మృతి చెందగా, జైద్ షా సైతం గాయాలపాలయ్యారు.

సీసీటీవీ ఫుటేజీతో దొరికిపోయిన నిందితుడు

ప్రమాదం జరిగిన వెంటనే సందీప్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలించి నిందితుడిని గుర్తించారు. పక్కా ఆధారాలతో సందీప్‌ను అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp