|  
FLASH NEWS
Box Office Trend : బాక్సాఫీస్ వద్ద భక్తి పారవశ్యం.. రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ఇరుముడి, హనుమాన్ అంశ్  •  Indian Army : రూ.46 లక్షల అమెజాన్ ప్యాకేజీ వదిలేసి సైన్యంలోకి.. నువ్వు గ్రేట్ గురూ!  •  వెనక్కి తగ్గిన రాజగోపాల్ రెడ్డి? నకిరేకల్ సీఎం సభకు హాజరు..  •  తెలుగు వర్సిటీ జర్నలిజం విద్యార్థుల వినూత్న ప్రయత్నం.. నేడు ‘గురుదక్షిణ’ కవితా సంకలనం ఆవిష్కరణ  •  Giorgia Meloni : యుద్ధానంతర ఇటలీ చరిత్రలో జార్జియా మెలోనీ అరుదైన రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు  • 
Skip to content

CM Revanth Reddy : నకిరేకల్ సీఎం పర్యటనకు ముందు టెన్షన్.. ఎంజీయూ విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్టు

nakrekal cm visit student arrests
nakrekal cm visit student arrests

నార్కట్ పల్లి, సూర్య న్యూస్ : నకిరేకల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభను అడ్డుకుంటారనే అనుమానంతో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. విద్యార్థి నాయకులు మోహన్, అజయ్, సతీష్‌లను అదుపులోకి తీసుకుని నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ ముందస్తు అరెస్టులపై విద్యార్థి సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన కోసం విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతున్న తమ గొంతును పోలీసుల ద్వారా నొక్కేయాలని చూడటం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని వారు మండిపడ్డారు. అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయలేరని, ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు.

ప్రశ్నించే నాయకులను అరెస్ట్ చేయడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని వారు ఆరోపించారు. విద్యార్థుల హక్కుల కోసం ఎన్ని నిర్బంధాలు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అణచివేత పెరిగే కొద్దీ విద్యార్థి ఉద్యమం మరింత ఉధృతమవుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp