
మర్రిగూడ: మండలంలోని కమ్మగూడెం గ్రామంలో గల సెయింట్ థెరిసాస్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులకు అపూర్వ గౌరవ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో హాజరైన ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులతో కేక్ కట్ చేయించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా, విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలు పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసే గురువుల సేవలను, వారి అంకితభావాన్ని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. విద్యార్థులకు కేవలం జ్ఞానాన్ని పంచడమే కాకుండా, వారి జీవితానికి దిశానిర్దేశం చేసేది ఉపాధ్యాయులేనని కీర్తించారు. గురువుల విశేష కృషిని గౌరవిస్తూ నిర్వహించిన ఈ వేడుకలు ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య సాగాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోత్స్న, ఇతర ఉపాధ్యాయినులు పాల్గొన్నారు


🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



