
నాంపల్లి (సూర్య న్యూస్ తెలుగు): దామెర ప్రాథమికోన్నత పాఠశాలలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తుకు, పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న గురువులను గ్రామ సర్పంచ్ దామెర శోభా సహదేవ్ ఘనంగా సన్మానించారు.
దాతలు శరత్ పెట్లోజు, ఎక్స్‌ట్రా మైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంద నాగమోహన్ అందించిన రూ.3,000 ఆర్థిక సహకారంతో ఉపాధ్యాయులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని, తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ వీలైతే పేదలకు సాయం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందా రాజశేఖరం, ఉపాధ్యాయులు యాదయ్య, వెంకటరమణ, హిమామ్, శ్రీహరి, మహేష్, ఉజ్వల, శ్రవణ్, శిరీష, రవి, సాజిదా బేగం, సౌజన్య, శివరాణి తదితరులు పాల్గొన్నారు

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



