
హైదరాబాద్, సూర్య న్యూస్ : రాష్ట్రంలో 22ఏ (22A Lands) అంశంపై తన రాజీనామాను డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను పదవిలో ఉండి ప్రజాసేవ కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే, తనను రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉందని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగా తాను కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించడానికి, అలాగే ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించడానికి తాను నిరంతరం శ్రమిస్తున్నానని ఆయన గుర్తు చేశారు. పేద ప్రజల పక్షాన నిలబడి పని చేస్తున్నందుకే తాను పదవికి రాజీనామా చేయాలా అంటూ ఆయన బీఆర్ఎస్ సభ్యులను సూటిగా ప్రశ్నించారు.
మీరే రాజీనామా చేయాలి
ప్రతిపక్ష నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, అసలు రాజీనామా చేయాల్సింది తాను కాదని ఎదురుదాడికి దిగారు. ఏకంగా రూ.23 కోట్ల మేర జీతాలు, అలవెన్సుల రూపంలో ప్రజా ధనాన్ని తీసుకున్న నేతలు, కనీసం ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీకి కూడా రావడం లేదని ఆయన విమర్శించారు. సభకు రాని వారే తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని మంత్రి పొంగులేటి డిమాండ్ చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



