|  
● FLASH NEWS
Supreme: వారసత్వ ఆస్తిలో మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు  •  Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  •  MEIL: వాటర్ సప్లై ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు.. ఆంధ్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  •  Jobs: కేంద్ర అణుశక్తి శాఖలో 254 టీచర్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో  •  Supreme: ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలు కస్టడీలో ఉంటే సస్పెండ్ అయినట్లే: సుప్రీంకోర్టు  • 
Skip to content

Veeramani: ‘ఎప్స్టీన్ ఆఫ్ తమిళనాడు’.. ఎవరీ 84 ఏళ్ల వృద్ధుడు, మళ్లీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు?

చెన్నై, సూర్య న్యూస్ : తమిళనాడులో ఇప్పుడు ‘ఎప్స్టీన్ ఆఫ్ టీఎన్’ (Epstein of TN) వ్యవహారం సంచలనంగా మారింది. 84 ఏళ్ల వయసున్న ప్రముఖ గ్రానైట్ వ్యాపారి (Granite Tycoon) వీరమణిని పోలీసులు మరోసారి అరెస్ట్ చేయడంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఎవరీ వీరమణి, ఆయనపై ఉన్న ఆరోపణలు ఏంటి, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయ్యాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

వైరల్ వీడియోతో వెలుగులోకి..

గతేడాది ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై అప్పట్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ వీడియోలో ఉన్న వృద్ధుడు స్థానిక గ్రానైట్ దిగ్గజం వీరమణిగా నిర్ధారించి వెంటనే ఆయనను అరెస్ట్ చేశారు. అయితే, అప్పటి ప్రభుత్వ పెద్దల చొరవతోనే ఆయనను కేసు నుంచి సులువుగా విడుదల చేశారనే ఆరోపణలు బలంగా వినిపించాయి.

మళ్లీ తెరపైకి పాత కేసు

ఈ కేసు దాదాపు మరుగున పడిపోయిందనుకున్న సమయంలో, తాజాగా ఓ సామాజిక కార్యకర్త ఆ పాత వీడియో వ్యవహారంపై పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, వీరమణిని మరోసారి అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మైనర్‌పై అకృత్యాలకు పాల్పడిన వ్యవహారం మళ్లీ వెలుగులోకి రావడంతో స్థానికంగా ఇది తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp