
హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ (Mangalhat Police Station) పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. తనను నిత్యం వేధిస్తున్నాడనే తీవ్ర ఆగ్రహంతో ఓ వివాహిత, యువకుడిని చున్నీతో గొంతు నులిమి హతమార్చింది. ఈ ఘటన ధూల్‌పేట్‌లోని శివ్లాల్ నగర్లో సోమవారం చోటుచేసుకుంది.
పోలీసుల ప్రాథమిక విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానికంగా ఉండే సాయి లాల్ సింగ్ (25) అనే యువకుడు, అనిషా సింగ్ అనే వివాహితను కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. పద్ధతి మార్చుకోవాలని ఆమె పలుమార్లు హెచ్చరించినా సాయి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో సోమవారం కలవాలని సాయి ఆమెను కోరగా, పక్కా ప్రణాళికతో అనిషా అతడిని ధూల్‌పేట్‌కు రమ్మని పిలిచింది.
సాయి ఇంట్లోకి రాగానే, అనిషా చున్నీతో అతడి మెడకు బిగించి ప్రాణాలు తీసింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ హత్యను వివాహిత ఒక్కతే చేసిందా? లేక ఇందులో ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



