
నాగ్పూర్, సూర్య న్యూస్ : కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని మినిరత్న సంస్థ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (MECL) 122 నాన్ ఎగ్జిక్యూటివ్ (Non Executive Posts) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు గడువు రేపటితో (అక్టోబర్ 11) ముగియనుండటంతో అర్హత ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
సెప్టెంబర్ 12న ప్రారంభమైన ఈ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. అకౌంటెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, జూనియర్ డ్రైవర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎంఈసీఎల్ అధికారిక వెబ్సైట్ www.mecl.co.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అయితే ఒక అభ్యర్థి కేవలం ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
దరఖాస్తు చేసుకునే పోస్టును బట్టి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. 2026 సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల గరిష్ట వయసు 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.19,600 నుంచి రూ.55,900 వరకు ప్రారంభ వేతనం అందిస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు (PwD), ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



