|  
● FLASH NEWS
Raptadu: రాప్తాడు ఉన్మాదిపై పోలీసుల కాల్పులు.. టపాసులు పేల్చి సంబరాలు  •  HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  •  Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  • 
Skip to content

Bollywood: ఇంట్లో కాలు జారిపడి ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

ముంబై, సూర్య న్యూస్ : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సంజయ్ గుప్తా (Sanjay Gupta) హఠాన్మరణం చెందారు. ముంబైలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో తలకు తీవ్ర గాయమై ఆయన తుదిశ్వాస విడిచారు.

57 ఏళ్ల వయసులో సంజయ్ గుప్తా ఆకస్మిక మరణంతో బాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తన సుదీర్ఘ కెరీర్‌లో యాక్షన్, క్రైమ్ నేపథ్యమున్న ఎన్నో అద్భుతమైన సినిమాలను ఆయన ప్రేక్షకులకు అందించారు. ‘కాంటే’, ‘షూటౌట్ ఎట్ వడాలా’, ‘కాబిల్’, ‘జిందా’, ‘ముంబై సాగా’, ‘ముసాఫిర్’ వంటి పలు భారీ హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.

సంజయ్ గుప్తా మృతి వార్త విని పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp