|  
● FLASH NEWS
HMT: హెచ్‌ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు మద్దతు.. కేంద్రంపై ఎమ్మెల్యే వివేకానంద్ ఫైర్  •  Supreme: వారసత్వ ఆస్తిలో మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు  •  Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  •  MEIL: వాటర్ సప్లై ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు.. ఆంధ్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  •  Jobs: కేంద్ర అణుశక్తి శాఖలో 254 టీచర్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో  • 
Skip to content

Condolence: అల్లం బుచ్చమ్మ భౌతిక కాయానికి పలువురి నివాళులు.. కుటుంబానికి పరామర్శ

రిపోర్టర్: Surya news

హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రముఖ జర్నలిస్ట్ అల్లం నారాయణ మాతృమూర్తి కామ్రేడ్ అల్లం బుచ్చమ్మ ఇటీవల పరమపదించడం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తల్లిని కోల్పోయిన అల్లం నారాయణతో పాటు వారి కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు స్వయంగా కలిసి పరామర్శించారు. ఈ తీరని విషాద సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మనోధైర్యం అందించిన నాయకులు, జర్నలిస్టులు..

తెలంగాణ రాష్ట్ర, కేంద్ర స్థాయి రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, న్యూస్ రీడర్లు, రిపోర్టర్లు, వివిధ జిల్లాల మీడియా ప్రతినిధులు బుచ్చమ్మ భౌతికకాయాన్ని సందర్శించి అశ్రునివాళులు అర్పించారు. మాతృమూర్తిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న అల్లం నారాయణకు మనోధైర్యాన్ని అందించారు. తల్లి చూపిన ప్రేమ, ఆప్యాయతలు కుటుంబ సభ్యుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బోయపల్లి శేఖర్ గౌడ్ సైతం స్వయంగా వెళ్లి పరామర్శించారు. భగవంతుడు అల్లం బుచ్చమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ అపారమైన దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మారుతి సాగర్, అవ్వారి భాస్కర్, తిరుపతి నాయక్, బోయపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp