|  
● FLASH NEWS
HMT: హెచ్‌ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు మద్దతు.. కేంద్రంపై ఎమ్మెల్యే వివేకానంద్ ఫైర్  •  Supreme: వారసత్వ ఆస్తిలో మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు  •  Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  •  MEIL: వాటర్ సప్లై ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు.. ఆంధ్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  •  Jobs: కేంద్ర అణుశక్తి శాఖలో 254 టీచర్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో  • 
Skip to content

Jobs: వర్సిటీల్లో 526 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలివే

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువుల (Assistant Professor Jobs) భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పది వర్సిటీల్లో మొత్తం 526 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ అధికారులు రిక్రూట్‌మెంట్ షెడ్యూల్‌ను (Recruitment Schedule) ఖరారు చేశారు. ఈ మేరకు పక్కా రోడ్‌మ్యాప్ సిద్ధం చేసిన అధికార యంత్రాంగం, వచ్చే ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందజేసేలా కార్యాచరణను ప్రకటించింది.

ఒకేసారి రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ

ప్రభుత్వం జీవో 142 ద్వారా మొదటి విడతలో 429 రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మంజూరు చేసింది. వీటితో పాటు అక్టోబర్ 31 నాటికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్సిటీల్లో 173 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 97 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండగా, మిగిలిన 76 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ 97 బ్యాక్‌లాగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను కూడా రెగ్యులర్ పోస్టులతో పాటే ఒకేసారి భర్తీ చేసేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ, ఒకే షెడ్యూల్‌లో నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

నియామక ప్రక్రియ షెడ్యూల్ ఇదే..

అధికారిక షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1వ తేదీన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 2 నుంచి 22 వరకు ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 30 వరకు దరఖాస్తుల స్క్రూటినీ చేపట్టి, ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు ప్రిలిమినరీ అర్హుల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను ప్రకటిస్తారు.

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు 1:10 నిష్పత్తిలో ఫిబ్రవరి 11 నుంచి 28 వరకు ఆయా యూనివర్సిటీల్లోనే డెమో, డొమైన్ నాలెడ్జ్ అసెస్‌మెంట్ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి 1:5 నిష్పత్తిలో మార్చి 1 నుంచి ఏప్రిల్ 10 వరకు ఇంటర్వ్యూలు జరుపుతారు. ఏప్రిల్ 21 నాటికి మెరిట్ లిస్ట్, రోస్టర్ తనిఖీ పూర్తి చేసి, ఏప్రిల్ 30 నాటికి అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందజేస్తారు.

ఉస్మానియా వర్సిటీలోనే అత్యధికం

రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేయనున్న 526 పోస్టుల్లో అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీలోనే 281 ఖాళీలు (252 రెగ్యులర్, 29 బ్యాక్‌లాగ్) ఉన్నాయి. ఆ తర్వాత కాకతీయ వర్సిటీలో 58, పాలమూరు వర్సిటీలో 52, శాతవాహన వర్సిటీలో 52, ఆర్‌జీయూకేటీలో 22, తెలుగు వర్సిటీలో 19, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో 16, తెలంగాణ వర్సిటీలో 14, మహాత్మా గాంధీ వర్సిటీలో 9, జేఎన్టీయూలో 3 పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి వర్సిటీని ఒక యూనిట్‌గా తీసుకుని ఈ నెల 30 వ తేదీలోగా 100 పాయింట్ల రోస్టర్, రిజర్వేషన్ల పరిశీలన పూర్తి చేసి ఆయా వర్సిటీల ఈసీల ఆమోదం తీసుకోనున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp