|   
🔴 BREAKING NEWS ► Youtuber Ravan Arrest : యూట్యూబర్ రావణ్ మళ్లీ అరెస్ట్.. ఐదోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు Vaibhav Sooryavanshi : సచిన్ 37 ఏళ్ల రికార్డు బ్రేక్.. అరంగేట్రం చేసిన 15 ఏళ్ల కుర్రాడు. కానీ..? TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా Save Telugu University : అక్షరాల గుడిలో ఆక్రమణల పర్వం.. వర్సిటీని కాపాడుకునేందుకు కదిలివచ్చిన విద్యార్థి, మేధావి లోకం!
Skip to content

RRB Technician Recruitment 2026 : నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ, సూర్య న్యూస్:రైల్వే శాఖలో (Railway Department) ఉద్యోగం సాధించాలనుకునే యువతకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా మొత్తం 6,565 టెక్నీషియన్ (Technician) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సికింద్రాబాద్ జోన్ (Secunderabad Zone) పరిధిలో కూడా పెద్ద సంఖ్యలో పోస్టులు కేటాయించారు. ఈ నియమాకాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు, అర్హతలు, వయోపరిమితి మరియు దరఖాస్తు విధానం గురించి పూర్తి వివరాలు కింద స్పష్టంగా ఇవ్వబడ్డాయి.

ఖాళీల వివరాలు (Vacancy Details):

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

​దేశవ్యాప్తంగా మొత్తం 6,565 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

​ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్) కింద 323 పోస్టులు ఉన్నాయి.

​టెక్నీషియన్ గ్రేడ్-III కింద 6,242 పోస్టులను భర్తీ చేస్తారు.​

సికింద్రాబాద్ జోన్ పరిధిలో మొత్తం 399 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

​దీనిలో గ్రేడ్-I పోస్టులు 4 కాగా, గ్రేడ్-III పోస్టులు 395 కేటాయించారు.

విద్యార్హతలు (Educational Qualifications):​

పోస్టులను బట్టి అభ్యర్థులు పదో తరగతి (10th Class), ఐటీఐ (ITI), డిప్లొమా, బీఎస్సీ (BSc) పూర్తి చేసి ఉండాలి.​

లేదా సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (Degree) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి (Age Limit):​

అభ్యర్థుల వయసును జులై 1, 2026 నాటికి పరిగణనలోకి తీసుకుంటారు.​

టెక్నీషియన్ గ్రేడ్-I పోస్టులకు వయసు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.​

టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.​

రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఓబీసీ (OBC) అభ్యర్థులకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.​

ఎస్సీ, ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఇస్తారు.​

దివ్యాంగులకు గరిష్టంగా 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

​వేతనం (Salary):​

టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.29,200 ప్రారంభ వేతనం ఉంటుంది.​

టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900 ప్రారంభ వేతనం చెల్లిస్తారు.​

దరఖాస్తు ఫీజు (Application Fee):​జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

​ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మాజీ సైనికులు, మైనారిటీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం (Selection Process):​

ముందుగా అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు.

​ఇందులో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification) చేస్తారు.

​చివరిగా మెడికల్ పరీక్షల (Medical Test) ఆధారంగా తుది అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం (Exam Pattern):​

రెండు గ్రేడ్ల పోస్టులకు సంబంధించి పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.

​జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథ్స్, బేసిక్ సైన్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.​

పరీక్ష రాసేందుకు సమయం 90 నిమిషాలుగా (90 Minutes) నిర్ణయించారు.​

ముఖ్యమైన తేదీలు మరియు వెబ్‌సైట్ (Important Dates & Website):​

అభ్యర్థులు ఆర్ఆర్బీ (RRB) అధికారిక వెబ్సైట్ indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.​

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జులై 29, 2026 గా ప్రకటించారు.

📲 Join WhatsApp