|  
FLASH NEWS
Indian Army : రూ.46 లక్షల అమెజాన్ ప్యాకేజీ వదిలేసి సైన్యంలోకి.. నువ్వు గ్రేట్ గురూ!  •  వెనక్కి తగ్గిన రాజగోపాల్ రెడ్డి? నకిరేకల్ సీఎం సభకు హాజరు..  •  తెలుగు వర్సిటీ జర్నలిజం విద్యార్థుల వినూత్న ప్రయత్నం.. నేడు ‘గురుదక్షిణ’ కవితా సంకలనం ఆవిష్కరణ  •  Giorgia Meloni : యుద్ధానంతర ఇటలీ చరిత్రలో జార్జియా మెలోనీ అరుదైన రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు  •  ISRO EOS-08 : ఇస్రో మరో అద్భుతం.. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3  • 
Skip to content

​S Janaki Death News : స్వరాల సిరిమల్లె ఇక సెలవు.. శాశ్వతంగా మూగబోయిన గానకోకిల ఎస్. జానకమ్మ గొంతుక

Chennai, Surya News: భారతీయ చలనచిత్ర సంగీత (Indian Cinema Music) ప్రపంచంలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆరు దశాబ్దాల పాటు తన మధురమైన గాత్రంతో యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ దిగ్గజ గాయని ఎస్. జానకి (S Janaki) కన్నుమూశారు. 88 ఏళ్ల వయసులో ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం రేపల్లెలో జన్మించిన జానకమ్మ మృతితో అశేష సంగీత అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పదిహారేళ్ల ప్రాయంలోనే సినిమాల్లో ‘సిరిమల్లె పువ్వా’ అంటూ ఆమె పాడిన తీరు, ఆ మధుర స్వరం ఇక శాశ్వతంగా మూగబోయింది.

విలక్షణమైన గాత్రంతో సరికొత్త రికార్డులు

జానకమ్మ గొంతులో పలికే ప్రతి అక్షరం ఒక మ్యాజిక్ లాంటిది. లాలిపాటలో ఉండే మాతృప్రేమను, జానపదంలో ఉండే జోరును, విరహ గీతంలోని వేదనను తన గాత్రంతో అద్భుతంగా ఆవిష్కరించారు. చిన్న పిల్లల వాయిస్ నుంచి పక్షుల కిలకిలల వరకు ఎన్నో శబ్దాలను తన గొంతులో పలికించి శ్రోతలను మంత్రముగ్ధులను చేయడం ఆమెకే చెల్లింది. తాగుబోతు పాత్రల హావభావాలకు సైతం తన స్వరంతో ప్రాణం పోసిన అరుదైన గాయని ఆమె.

17 భాషల్లో 48 వేల పాటలు

కేవలం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషలకే ఆమె పరిమితం కాలేదు. హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ వంటి సుమారు 17 భాషల్లో ఆమె వేలాది పాటలు పాడారు. తన సుదీర్ఘమైన కెరీర్‌లో 48 వేలకు పైగా పాటలకు ప్రాణం పోసి రికార్డు సృష్టించారు. అంతేకాకుండా 1988లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘మౌనపోరాటం’ (Mouna Poratam) సినిమాకు సంగీత దర్శకురాలిగా పనిచేసి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.

జాతీయ అవార్డులు.. పద్మభూషణ్ తిరస్కరణ

తన అద్భుతమైన ప్రతిభకు గానూ ఆమె నాలుగు సార్లు జాతీయ అవార్డులను (National Awards) అందుకున్నారు. 33 వేర్వేరు రాష్ట్రాల నుంచి ప్రభుత్వ పురస్కారాలను దక్కించుకున్నారు. కన్నడ చిత్రసీమకు చేసిన సేవలకు గాను మైసూర్ విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 1997లో ఫిల్మ్‌ఫేర్, సైమా ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ఆమెను వరించాయి. అయితే, 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మభూషణ్’ (Padma Bhushan) పురస్కారాన్ని ఆమె సున్నితంగా తిరస్కరించడం అప్పట్లో సంచలనంగా మారింది. దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు రావడం లేదని, తనకు ‘భారతరత్న’ ఇవ్వకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. జానకమ్మ భౌతికంగా దూరమైనా ఆమె పాడిన పాటలు భారతీయ సంగీత (Indian Music) చరిత్రలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp