|   
🔴 BREAKING NEWS ► Vaibhav Sooryavanshi : సచిన్ 37 ఏళ్ల రికార్డు బ్రేక్.. అరంగేట్రం చేసిన 15 ఏళ్ల కుర్రాడు. కానీ..? TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా Save Telugu University : అక్షరాల గుడిలో ఆక్రమణల పర్వం.. వర్సిటీని కాపాడుకునేందుకు కదిలివచ్చిన విద్యార్థి, మేధావి లోకం! Pakistan Airstrikes : అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం, ఘాటుగా స్పందించిన భారత్
Skip to content

Telangana Govt Jobs : విద్యాశాఖలో భారీగా కొలువుల భర్తీ.. నివేదికలో వెల్లడి

హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం (Telangana Government) అడుగులు వేస్తోంది. ప్రభుత్వ నియామకాల్లో శాంతిభద్రతల (Law and Order) తర్వాత అత్యధిక ప్రాధాన్యతను విద్యారంగానికే (Education Sector) కేటాయించినట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2026 (Socio-Economic Outlook 2026) నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో మొత్తం 67,763 పోస్టులను భర్తీ చేయగా అందులో విద్యాశాఖలోనే అత్యధిక నియామకాలు జరిగినట్లు స్పష్టమవుతోంది. హోం శాఖ (Home Department) 15,714 పోస్టులతో మొదటి స్థానంలో ఉండగా సెకండరీ ఎడ్యుకేషన్ (Secondary Education) 10,272 పోస్టుల భర్తీతో రెండో స్థానంలో నిలిచింది.

దీనికి అదనంగా హయ్యర్ ఎడ్యుకేషన్ (Higher Education) లో భర్తీ చేసిన 2,474 పోస్టులను కలిపితే ఒక్క విద్యా రంగంలోనే మొత్తం 12,746 నియామకాలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. సాధారణంగా ఎక్కువ మంది సిబ్బంది అవసరమయ్యే వైద్య ఆరోగ్య శాఖ (Health Department) లో 9,023 పోస్టులు, రెవెన్యూ శాఖ (Revenue Department) లో 8,079 పోస్టులు భర్తీ చేయగా వాటి కంటే విద్యాశాఖలోనే ప్రభుత్వం ఎక్కువ ఖాళీలను భర్తీ చేయడం విశేషం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ నియామకాలను (Teacher Recruitment) ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 27 విభాగాల్లోని 67,763 పోస్టుల భర్తీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని సామాజిక ఆర్థిక సర్వే నివేదిక స్పష్టం చేసింది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp