|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

72nd National Film Awards : జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో సత్తా చాటిన తెలుగు సినిమా.. అవార్డులు అందుకున్న సుకుమార్, నిహారిక

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : దేశ రాజధానిలో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) చేతుల మీదుగా సినీ ప్రముఖులు ఈ అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై తెలుగు సినిమా మరోసారి సత్తా చాటింది. టాలీవుడ్ ప్రముఖులు సుకుమార్, నాగ్ అశ్విన్, నిహారిక కొణిదెల, వెంకీ అట్లూరి తదితరులు తమ పురస్కారాలను సగర్వంగా స్వీకరించారు.

సత్తా చాటిన పుష్ప, కల్కి, లక్కీ భాస్కర్

పాన్ ఇండియా సెన్సేషన్ ‘పుష్ప’ సినిమాకు గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌గా స్టార్ డైరెక్టర్ సుకుమార్ జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే ఇదే చిత్రానికి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్లుగా దీపాలి, ఇక్బాల్‌చంద్ శర్మ పురస్కారాలు స్వీకరించారు. ఇక బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ బెస్ట్ పాపులర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డును గెలుచుకోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. అలాగే ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో దర్శకుడు వెంకీ అట్లూరి అవార్డు దక్కించుకున్నారు.

ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’

నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా 72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ సినిమాకు గాను నిర్మాత హోదాలో నిహారిక కొణిదెల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె రజత కమలం అవార్డును అందుకోవడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp