|  
● FLASH NEWS
Shreyas: విండీస్‌పై భారత్ ఘన విజయం.. శతకంతో చెలరేగిన అయ్యర్  •  బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. గాంధీ ఆస్పత్రికి తరలింపు  •  Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  • 
Skip to content

భావి తరాల తీర్చిదిద్దే బాధ్యత మనందరిది.. విద్యా వ్యవస్థపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కీలక వ్యాఖ్యలు!

హైదరాబాద్, మార్చి 22 (సూర్య న్యూస్): భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత కేవలం ఉపాధ్యాయులదే కాదని, తల్లిదండ్రుల పాత్ర కూడా అందులో ఎంతో కీలకమని బీఆర్ఎస్ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. ఆదివారం 132-జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ పాఠశాల మొదటి బ్రాంచ్‌ను ఆయన ఘనంగా ప్రారంభించారు.

నాణ్యమైన విద్యతోనే సమాజ అభివృద్ధి​

పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న విద్యా సదుపాయాలను చూసి ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో నాణ్యమైన విద్యతో పాటు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కలిగిన విద్యాసంస్థలు సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతం కావాలంటే పాఠశాలలు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

విద్యార్థుల వికాసమే లక్ష్యం కావాలి

​పాఠశాల నిర్వాహకులను అభినందిస్తూ, విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణను కూడా నేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, పాఠశాల డైరెక్టర్లు పేట నాగూర్ బాబు, శశికాంత్ శర్మ, పేట దివ్య భారతి, రేఖ శర్మ మరియు బీఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కాలే నాగేష్, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, గొరిగే బాలప్ప, తోకల నాగేశ్ రెడ్డి, ఎల్లా గౌడ్, కాలే గణేష్, అడప శేషు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp