|   
🔴 BREAKING NEWS ► AP Job Calendar 2026 : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల అనకాపల్లిని దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు Nalgonda News : చండూరు మార్కెట్ యార్డుకు కన్నం.. 1100 బస్తాల ప్రభుత్వ ధాన్యం లూటీ BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక!
Skip to content

Telangana Politics : పటాన్ చెరు ఎమ్మెల్యే అవినీతిలో హరీష్ రావుకు వాటా.. మైనింగ్ అక్రమాలపై కాంగ్రెస్ నేతల సంచలన ఆరోపణలు..

Hyderabad, Surya News: పటాన్ చెరు ఎమ్మెల్యే (Patancheru MLA) గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిల అవినీతిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వీరిద్దరూ పాల్పడిన అక్రమ మైనింగ్, భూకబ్జాలను మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) వెనకేసుకురావడం శోచనీయం అని పటాన్ చెరు కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. వందల కోట్ల రూపాయల మైనింగ్ అక్రమాలను అసెంబ్లీ వేదికగా హరీష్ రావు చిన్న తప్పుగా ప్రస్తావించడం ఆయన నిజాయితీని ప్రశ్నిస్తోంది. హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే మధుసూదన్ రెడ్డి మైనింగ్ అవకతవకలపై సీఐడీ (CID) లేదా సిట్ తో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. పటాన్ చెరు ప్రాంతంలోని చెట్లు, గుట్టలను అడిగినా వీరి అవినీతి బాగోతం చెబుతాయి అని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు.

హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలోనే లక్డారంలో భారీగా అక్రమ మైనింగ్ (Illegal Mining) జరిగింది. అప్పట్లోనే మైనింగ్ అధికారులు వీరికి క్లోజర్ లెటర్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. సుమారు 380 కోట్ల రూపాయల అక్రమ సంపాదనను చిన్న విషయంగా ఎలా కొట్టిపారేస్తారు అని వారు నిలదీశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కబ్జాలు, అక్రమ మైనింగ్ లో హరీష్ రావుకు కూడా వాటా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంద్రేశం సర్వే నంబర్ 450లో 1.12 ఎకరాల భూమి, పోచారం సర్వే నంబర్ 62లో వంద ఇళ్లను కబ్జా చేసి వేల కోట్లు గడించారు అని వారు ఆరోపించారు. పాటి గ్రామంలోని ఆనంద్ నగర్ లో ఎమ్మెల్యే మేనల్లుడు జంగారెడ్డి ప్లాట్ల ఓనర్లపై దౌర్జన్యం చేస్తే హైడ్రా (HYDRA) రంగంలోకి దిగి కాపాడింది.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన అక్రమాలకు ఆయన జీవితకాలం జైలులోనే గడపాలి. సొంత పార్టీ నేత కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఐదు నెలలు జైలులో ఉంటే బాధపడని హరీష్ రావు, మధుసూదన్ రెడ్డి నెల రోజులు జైలుకు వెళితే బాధపడటం సిగ్గుచేటు. ఎమ్మెల్యే మరియు ఆయన తమ్ముడికి సంబంధించిన లక్ష గజాల డాక్యుమెంట్లు, కిలోల కొద్దీ బంగారం, వేల కోట్ల ఆస్తులను ఈడీ (ED) అటాచ్ చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి. పటాన్ చెరు గడ్డపై ఈ అవినీతిపరుల ఆటలు సాగనివ్వమని, వారి అక్రమాలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp