|   
🔴 BREAKING NEWS ► TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా Save Telugu University : అక్షరాల గుడిలో ఆక్రమణల పర్వం.. వర్సిటీని కాపాడుకునేందుకు కదిలివచ్చిన విద్యార్థి, మేధావి లోకం! Pakistan Airstrikes : అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం, ఘాటుగా స్పందించిన భారత్ Telangana ACB Raids : తెలంగాణలో ఏసీబీ భారీ వేట.. డీఎస్పీ ఇంట్లో 200 కోట్ల కుబేర గుట్టు రట్టు, దొరికిన డైరీలో సంచలన నిజాలు
Skip to content

Telangana CM : హైడ్రా, ఈగల్ తర్వాత రేవంత్ సర్కార్ మరో సంచలనం.. కొత్తగా టార్గెట్ చేసిన ఆ ‘మాఫియా’ ఇదే..

Hyderabad, Surya News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రంలో మరో సంచలన నిర్ణయానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే హైడ్రా (HYDRA), ఈగల్ వంటి కఠినమైన వ్యవస్థలతో అక్రమార్కులకు చెక్ పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త మాఫియాపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆహార కల్తీని (Food Adulteration) అరికట్టేందుకు ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ లేదా వ్యవస్థను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను లోతుగా అధ్యయనం చేసి, త్వరలోనే అత్యంత పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 3.39 కోట్ల మందికి సన్నబియ్యం (Fine Rice) పంపిణీ చేసే పథకం ప్రారంభమై విజయవంతంగా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో శాసనసభ (Assembly) సెంట్రల్ హాలులో ప్రజాప్రతినిధులకు సన్నబియ్యంతో ప్రత్యేక భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో ముచ్చటిస్తూ రేషన్ మాఫియాకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

గతంలో రేషన్ షాపుల (Ration Shops) ద్వారా దొడ్డు బియ్యం ఇస్తే ప్రజలు ఎవరూ తినేవారు కాదని సీఎం గుర్తు చేశారు. ఆ బియ్యాన్ని అక్రమంగా రీసైక్లింగ్ చేస్తూ రేషన్ మాఫియా (Ration Mafia) విపరీతంగా పెరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వందల కోట్ల ఖర్చు తప్ప పేదలకు దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతోనే ఈ సన్నబియ్యం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించామని చెప్పారు. ఇందుకోసమే సన్నవడ్లు పండించే రైతులకు (Farmers) క్వింటాలుకు 500 రూపాయల బోనస్ (Bonus) ప్రకటించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp