|  
● FLASH NEWS
Shreyas: విండీస్‌పై భారత్ ఘన విజయం.. శతకంతో చెలరేగిన అయ్యర్  •  బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. గాంధీ ఆస్పత్రికి తరలింపు  •  Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  • 
Skip to content

Crime News : ‘సారీ నాన్న.. జాగ్రత్త’ అంటూ టీచర్ ఆత్మహత్య.. న్యూడ్ వీడియోలతో వేధించిన కిరాతకుడు అరెస్ట్ (Accused Arrested)

పామూరు, సూర్య న్యూస్: కన్నకూతురిని ప్రయోజకురాలిని చేయాలనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. తనను నమ్మించి మోసం చేయడమే కాకుండా, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న కిరాతకుడి వేధింపులు భరించలేక ఓ టీచర్ బలవన్మరణానికి పాల్పడింది. మరణించే ముందు తన అరచేతిపై “Sorry నాన్న.. జాగ్రత్త” అని రాసుకుని ఆమె తనువు చాలించడం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. ఈ ఘటనలో నిందితుడు షేక్ నాగూర్ బాషాను పామూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

​మార్కాపురం జిల్లా పామూరు మండలంలోని అయ్యవారిపల్లికి చెందిన బోడ మాధవి (24) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. అదే స్కూల్‌లో నిందితుడు నాగూర్ బాషా పిల్లలు చదువుతుండటంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు, ఆమెతో మాట్లాడిన ప్రైవేట్ వీడియో కాల్స్‌ను రహస్యంగా రికార్డ్ చేశాడు. కొంతకాలంగా ఆ న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, నీ పరువు తీస్తానని మాధవిని మానసిక క్షోభకు గురిచేశాడు.

నిందితుడి వేధింపులు మితిమీరడంతో, పరువు పోతుందనే భయంతో మాధవి మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అయితే చనిపోయే ముందు తన తండ్రి పట్ల ఉన్న మమకారాన్ని, ఆయనను ఒంటరిని చేస్తున్నాననే బాధను తన అరచేతిపై అక్షరబద్ధం చేసింది. “సారీ నాన్న.. జాగ్రత్త” అంటూ ఆమె రాసుకున్న ఆఖరి మాటలు చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు నాగూర్ బాషాను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp