|   
🔴 BREAKING NEWS ► Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో
Skip to content

Bandi Sanjay : కుమారుడి పోక్సో కేసులో కేంద్ర మంత్రికి ఊరట.. సంచలన ఉత్తర్వులు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు

Hyderabad, Surya News: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) కు భారీ ఊరట లభించింది. ఆయన కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) పై నమోదైన పోక్సో కేసు (POCSO Case) వ్యవహారంలో మంత్రిని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ప్రచారానికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు (Hyderabad City Civil Court) బ్రేక్ వేసింది. ఈ మేరకు సంచలన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

శుక్రవారం బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన కుమారుడిపై నమోదైన పోక్సో కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కోర్టుకు (Court) తెలిపారు. ఈ వివాదంలో తన పేరును ఎక్కడా ఉపయోగించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ (Social Media Platforms) లో తన పేరు వాడకుండా నిలువరించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటివరకు తన పేరుతో సర్క్యులేట్ అయిన వీడియోలను (Videos) తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

​ఈ పిటిషన్ పై స్పందించిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ లక్ష్యంగా కొనసాగిస్తున్న ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఆయనను టార్గెట్ చేస్తూ ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగ్స్, పత్రికా కథనాలు, డిజిటల్ కంటెంట్ (Digital Content), వాల్ పోస్టర్లను తొలగించాలని ఆదేశించింది. ఈ నెల 26 లోపు వాటిని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని మధ్యంతర ఉత్తర్వులు (Interim Orders) జారీ చేసింది. ఇకపై ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.

కాగా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Cyberabad Police Commissionerate) పరిధిలో కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు ఫైల్ అయిన సంగతి తెలిసిందే. ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు (Police) ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp