|   
🔴 BREAKING NEWS ► TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే.. అసలు కారణం ఇదే
Skip to content

Crime News : బాత్‌రూమ్ దగ్గర కూడా సీసీ కెమెరాలు.. డాక్టర్ భర్త శాడిజం.. పెళ్లైన 48 రోజులకే నవవధువు ఆత్మహత్య

అంబర్ నాథ్, సూర్య న్యూస్ :మహారాష్ట్ర (Maharashtra) రాష్ట్రంలోని అంబర్ నాథ్ ప్రాంతంలో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహమైన కేవలం 48 రోజులకే ఒక నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అనుమానంతో భర్త ఇంటి నిండా సీసీ కెమెరాలు (CCTV Cameras) ఏర్పాటు చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

కట్నం కోసం దాహం.. డాక్టర్ భర్త వేధింపులు

బాధితురాలు విశాఖ తిల్కర్ (Vishakha Tilkar) కు, డాక్టర్ గా పనిచేస్తున్న నితిన్ తిల్కర్ (Dr Nitin Tilkar) తో ఏప్రిల్ 30న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో యువతి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు (Dowry) ఇచ్చారు. అయితే అత్తింటి వారు మరింత కట్నం, బంగారం తేవాలని ఆమెను మానసికంగా మరియు శారీరకంగా వేధించడం మొదలుపెట్టారు. భర్త డాక్టర్ కావడంతో తమకు ఇంకా పెద్ద సంబంధాలు వచ్చేవని దెప్పిపొడిచేవారు. అత్త ఛాయా తిలక్, మరిది నినాద్ తిలక్ కూడా భర్తతో కలిసి వధువును తీవ్రంగా కొట్టేవారు.

బాత్‌రూమ్ వద్ద కూడా నిఘా

భర్త నితిన్ తిల్కర్ ప్రవర్తన అత్యంత దారుణంగా ఉండేది. భార్య ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవడానికి ఏకంగా ఇల్లు మొత్తం సీసీ కెమెరాలు (CCTV Cameras) పెట్టాడు. బెడ్ రూమ్, కిచెన్, బాల్కనీ తో పాటు ఏకంగా బాత్‌రూమ్ (Bathroom) దగ్గర కూడా కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాడు. డ్యూటీ నుంచి రాగానే ఆమె ఎవరితోనైనా మాట్లాడినట్లు అనిపిస్తే తీవ్రంగా కొట్టేవాడు. ఈ నరకం భరించలేక బాధితురాలు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి కన్నీరు పెట్టుకుంది. వారు వచ్చి తీసుకెళ్లే లోపే విశాఖ తిల్కర్ ఉరి వేసుకుని తనువు చాలించింది.

పోలీసుల యాక్షన్

ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు (Police) డాక్టర్ నితిన్ తిల్కర్ ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అత్త, మరిది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp