|   
🔴 BREAKING NEWS ► Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న?
Skip to content

Pragathi Nagar Market : ఆ మార్కెట్‌ను మార్చకండి సార్.. కొలను హన్మంత్ రెడ్డికి స్థానికుల విజ్ఞప్తి.. ఎందుకంటే?

ప్రగతి నగర్, సూర్య న్యూస్: కుత్బుల్లాపూర్ (Quthbullapur) నియోజకవర్గంలో ప్రగతి నగర్ కూరగాయల మార్కెట్ (Vegetable Market) నిర్వహణపై కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను వేరే చోటికి తరలించే ప్రతిపాదనలపై స్థానికులు మరియు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్ యాజమాన్యం మరియు స్థానికులు ఈరోజు బాచుపల్లి (Bachupally) కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని (Kolan Hanumanth Reddy) కలిసి తమ సమస్యను మొరపెట్టుకున్నారు.

మార్కెట్ నిర్వహణపై తమ అభిప్రాయాలను వారు స్పష్టంగా ఆయనకు తెలియజేశారు. ప్రస్తుతం మార్కెట్ నడుస్తున్న ప్రదేశంలో పెద్దగా ట్రాఫిక్ సమస్యలు (Traffic Issues) లేవని వ్యాపారులు వివరించారు. ఒకవేళ ప్రగతి స్కూల్ మెయిన్ రోడ్ (Pragathi School Main Road) వద్దకు ఈ మార్కెట్‌ను మారిస్తే తీవ్రమైన ట్రాఫిక్ జామ్ తో పాటు వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రద్దీ ప్రాంతంలో మార్కెట్ పెడితే కొనుగోలుదారులకు కూడా ఇబ్బందులు తప్పవని గుర్తు చేశారు.

ప్రజల భద్రత, వ్యాపారుల సౌకర్యాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలని వారు కోరారు. అందువల్ల ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోనే మార్కెట్ కార్యకలాపాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేలా చొరవ చూపాలని కొలన్ హన్మంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ప్రతినిధులు షరీఫ్, ప్రశాంత్, ఆంజనేయులు, కృష్ణ రెడ్డి, భాస్కర్, మాణిక్యం, చిన్న ఆంజప్ప, బురాన్, లాల్ మొహమ్మద్, జహంగీర్, లక్ష్మి, నాగ లక్ష్మి, కుమారి, రాము, మహాలక్ష్మి, మేరి కుమారి తదితరులు పాల్గొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp