
వరంగల్, సూర్య న్యూస్: జనసేనాని (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (Niranjan) కన్నుమూశారు. ఆయన వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. హనుమకొండ (Hanumakonda) ప్రాంతానికి చెందిన నిరంజన్ మృతితో పవన్ అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. గత కొంతకాలంగా జన్యుపరమైన వ్యాధితో ఆయన బాధపడుతున్నారు.
ఈ వ్యాధి కారణంగా ఎదుగుదల లోపించి నిరంజన్ మంచానికే పరిమితం అయ్యారు. గత నెలలో పవన్ స్వయంగా వెళ్లి నిరంజన్ ను పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పి ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ సమయంలో తీసుకున్న సెల్ఫీలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయ్యాయి.
ఆ భేటీలో నిరంజన్ కు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని పవన్ అందజేశారు. తనకు కుక్కపిల్లను పెంచుకోవాలని ఉందని నిరంజన్ తన కోరికను వెలిబుచ్చారు. కొని పంపిస్తా చిన్నా అంటూ మాటిచ్చిన పవన్ అదే రోజు కుక్కపిల్లను పంపించారు. అంతేకాకుండా ఓజీ 2 (OG 2) తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని చెప్పారు. ఇద్దరం కలిసి సినిమా చూద్దామని పవన్ మాటిచ్చారు.
ఆ కల నెరవేరకుండానే నిరంజన్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇటీవల అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. మెరుగైన చికిత్స కోసం తల్లిదండ్రులు ఆయనను హైదరాబాద్ (Hyderabad) తీసుకువచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త పవన్ అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




