
హైదరాబాద్, సూర్య న్యూస్:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (Deputy CM Pawan Kalyan) పవన్ కల్యాణ్ కు సంబంధించి హైదరాబాద్ భూముల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా కోడి చెరువు (Kodi Cheruvu) ఆక్రమణ వ్యవహారంలో ఆయనపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
పవన్ కల్యాణ్ ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న దుష్ప్రచారానికి బెంగళూరు కోర్టు (Bangalore Court) చెక్ పెట్టింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. ఎక్స్ (Twitter), గూగుల్ (Google), మెటా (Meta) సంస్థలకు కోర్టు అత్యవసర నోటీసులు జారీ చేసింది. అనామక అకౌంట్ల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు జాన్ డో (John Doe) ఆర్డర్‌ను కోర్టు అమలులోకి తెచ్చింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న నిర్దిష్ట యూఆర్‌ఎల్‌లను (URLs) వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేసింది.
ఈ వివాదంపై పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. తెలంగాణలో (Telangana) జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ తాను ఎలాంటి చెరువు భూములను ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆరోపణలు చేస్తున్న వారు ఆక్రమణలను నిరూపిస్తే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తానంటూ బహిరంగ సవాల్ విసిరారు. తాజాగా కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో పవన్ కల్యాణ్ కు భారీ ఊరట లభించినట్లయింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



