|  
FLASH NEWS
Box Office Trend : బాక్సాఫీస్ వద్ద భక్తి పారవశ్యం.. రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ఇరుముడి, హనుమాన్ అంశ్  •  Indian Army : రూ.46 లక్షల అమెజాన్ ప్యాకేజీ వదిలేసి సైన్యంలోకి.. నువ్వు గ్రేట్ గురూ!  •  వెనక్కి తగ్గిన రాజగోపాల్ రెడ్డి? నకిరేకల్ సీఎం సభకు హాజరు..  •  తెలుగు వర్సిటీ జర్నలిజం విద్యార్థుల వినూత్న ప్రయత్నం.. నేడు ‘గురుదక్షిణ’ కవితా సంకలనం ఆవిష్కరణ  •  Giorgia Meloni : యుద్ధానంతర ఇటలీ చరిత్రలో జార్జియా మెలోనీ అరుదైన రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు  • 
Skip to content

HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, సూర్య న్యూస్: హైడ్రా (HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయనను అరెస్టు చేయాలని ముందుగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తితో అరెస్ట్ ఆదేశాలను ఉపసంహరించుకుంది.

​ప్రైవేటు భూమిలోకి వెళ్లొద్దన్న ఆదేశాలను మూడుసార్లు ధిక్కరించిన హైడ్రా.

కమిషనర్ ఏవీ రంగనాథ్ ను అరెస్ట్ చేయాలని హైకోర్టు సంచలన ఆదేశం.

ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తితో అరెస్ట్ ఆదేశాల ఉపసంహరణ.

వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఏవీ రంగనాథ్ (AV Ranganath).

అలవాటుపడ్డ నేరగాడిలా వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.

మల్కాజిగిరి (Malkajgiri) మండలం లోతుకుంటలోని ప్రైవేటు భూమి విషయంలో హైకోర్టు ఆదేశాలను హైడ్రా అధికారులు బేఖాతరు చేశారు. ఈ భూమికి సంబంధించి శాంత శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది. సివిల్ సూట్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. అయినప్పటికీ ఆ భూమిలో హైడ్రా జోక్యం చేసుకుంటుండటంతో అక్కడికి ప్రవేశించరాదని హైకోర్టు (High Court) హెచ్చరించింది.

కోర్టు ఆదేశించినప్పటికీ మూడోసారి కూడా హైడ్రా అధికారులు ఆ భూముల్లోకి ప్రవేశించారు. అంతేకాకుండా ఆ సంస్థ యజమానులపై అక్రమంగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయించారు. దీంతో బాధితులు మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఏవీ రంగనాథ్ ను అరెస్ట్ చేయాలని న్యాయమూర్తి మొదట ఆదేశించారు. ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తితో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుని వ్యక్తిగత హాజరుకు ఆదేశించారు. సాయంత్రం 6.30 గంటలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు.

ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా (Rule of law) అనేది ఒకటి ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ఆయన అలవాటుపడ్డ నేరగాడిలా మారారని మండిపడింది. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం చెల్లదని స్పష్టం చేసింది. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తితో అఫిడవిట్ దాఖలుకు అవకాశం ఇచ్చిన హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp