
హైదరాబాద్, సూర్య న్యూస్ : న్యాచురల్ స్టార్ నాని (Actor Nani) నటించిన తాజా చిత్రం ‘ప్యారడైజ్’ (Paradise Movie) విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ సేల్స్ ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్ల మార్కును దాటేసినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా ప్రకటించారు.
రూ. 43 కోట్లు దాటిన అడ్వాన్స్ సేల్స్
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రం ఏకంగా రూ. 43 కోట్ల మార్కును దాటేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. బుక్‌మైషో (BMS), డిస్ట్రిక్ట్ వంటి ఆన్లైన్ యాప్స్‌లో ఈ సినిమా టికెట్లకు భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది.
’గుంటూరు కారం’, ‘పెద్ది’ రికార్డులు బ్రేక్
కేవలం ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లోనే ఇప్పటికే 9 లక్షల టికెట్లు అమ్ముడవడంతో.. గతంలో ‘గుంటూరు కారం’, ‘పెద్ది’ తదితర చిత్రాల పేరిట ఉన్న ప్రీ-సేల్స్ రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లలో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



