|  
● FLASH NEWS
CEC: దేశద్రోహి జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్  •  Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు చారిత్రక రజతం  •  Banks: ఖాతాదారులకు అలర్ట్.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్!  •  CBSE : ముదురుతున్న ‘ఓఎస్‌ఎం’ వివాదం.. నాలుగు నెలల్లో మూడో బాస్ నియామకం  •  Chandrababu : మత్స్యకారులకు సీఎం చంద్రబాబు వరం.. ఏకంగా 50 కిలోలు ఉచితం  • 
Skip to content

Ramayana: ‘రామాయణ’ సరికొత్త పోస్టర్లు.. ‘త్రిలోకాధిపతి రావణ’గా యశ్ లుక్ వైరల్

హైదరాబాద్, సూర్య న్యూస్ : బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’ (Ramayana Movie) నుంచి మేకర్స్ సరికొత్త పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో సీతారామలక్ష్మణులతో పాటు త్రిలోకాధిపతి రావణుడి గెటప్‌లో ఉన్న కేజీఎఫ్ స్టార్ యశ్ (Yash) లుక్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.

ఈ సినిమాలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీరితో పాటు లక్ష్మణుడి పాత్ర ఉన్న ఫోటోను పంచుకున్న చిత్ర బృందం.. “ధర్మం కోసం ఎల్లప్పుడూ కలిసికట్టుగా ఉన్నారు” అని క్యాప్షన్ జోడించింది. మరోవైపు ‘త్రిలోకాధిపతి రావణ’ అంటూ యశ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయగా, ఆ పవర్‌ఫుల్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అత్యున్నత సాంకేతిక విలువలతో విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ ఎపిక్ మైథలాజికల్ డ్రామా నవంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రామాయణ ఇతిహాసం నేపథ్యంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp