
హైదరాబాద్, సూర్య న్యూస్ : రాష్ట్రంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అల్వాల్లో నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS Hospital) ఆసుపత్రికి కొత్తగా 339 పోస్టులను మంజూరు చేసింది. ఈ ఖాళీల భర్తీకి అనుమతి తెలుపుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ (Finance Department) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఆసుపత్రిలో వివిధ విభాగాలకు సంబంధించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బందితో పాటు అడ్మినిస్ట్రేటివ్, ఇంజనీరింగ్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తారు. ఎయిమ్స్ వేతనాల ప్రాతిపదికన ఈ నియామకాలను చేపట్టనున్నారు.
పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేసే ముందు కచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే చుట్టుపక్కల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



