|  
● FLASH NEWS
HMT: హెచ్‌ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు మద్దతు.. కేంద్రంపై ఎమ్మెల్యే వివేకానంద్ ఫైర్  •  Supreme: వారసత్వ ఆస్తిలో మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు  •  Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  •  MEIL: వాటర్ సప్లై ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు.. ఆంధ్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  •  Jobs: కేంద్ర అణుశక్తి శాఖలో 254 టీచర్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో  • 
Skip to content

MLC: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట: కల్వకుంట్ల కవిత

ఇద్దరు బీసీ అభ్యర్థులను బరిలోకి దించిన తెలంగాణ రక్షణ సేన

హైదరాబాద్, సూర్య న్యూస్ :
రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఒక పార్టీ ఇద్దరు బీసీ అభ్యర్థులను బరిలోకి దించినట్లు ప్రకటించింది. ఉన్నత విద్యావంతులైన యువకులకు అవకాశం కల్పించినట్లు పార్టీ అధ్యక్షురాలు స్పష్టం చేశారు.

రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ రక్షణ సేన (TRS) ఇద్దరు బీసీ అభ్యర్థులను బరిలోకి దించినట్లు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్ కొల్లూరిలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి డాక్టర్ శ్రీకాంత్ గౌడ్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం నుంచి ఆకాశ్ కొల్లూరి తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని వెల్లడించారు.

కల్వకుంట్ల కవిత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్ కొల్లూరిని ఆశీర్వదిస్తున్నారు

హామీలు మరిచిన కాంగ్రెస్‌కు పిలుపు

హామీలు మరిచిన కాంగ్రెస్, నిద్రలో ఉన్న విపక్షాలకు బుద్ధి చెప్పేందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అవకాశంగా మలుచుకోవాలని విద్యావంతులకు కవిత పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఫ్యూజ్ ఎగిరిపోయిందని, రైతులు, యువత కొత్త తరాన్ని ప్రోత్సహించి తమ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరారు. ఆర్థిక, రాజకీయ నేపథ్యం లేకపోయినా.. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్నత విద్యావంతులైన యువకులకు టికెట్లు కేటాయించామని తెలిపారు.

తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పాంప్లెట్లు విడుదల చేస్తున్న నాయకులు

ఓటును అమ్ముకునే అపవాదు తొలగించుకోవాలి

గ్రాడ్యుయేట్లు కూడా డబ్బులు తీసుకుని ఓటు వేస్తారన్న అపవాదును ఈ ఎన్నికల ద్వారా తొలగించుకోవాల్సిన అవసరం ఉందని కవిత స్పష్టం చేశారు. విద్యావంతులే డబ్బులకు ఆశపడితే వ్యవస్థలో అవినీతి మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శాసన మండలిలో ఉన్న ముగ్గురు గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీలు ప్రజల పక్షాన పోరాడే వారు కావాలని, అందుకే తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్షం లేకుండా పోయిందని, బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్‌లో చేరగా, బీజేపీ లోపాయికారీ ఒప్పందంతో వ్యవహరిస్తోందని విమర్శించారు.

బంజారాహిల్స్‌లో తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచార బృందం

ఫీజు రీయింబర్స్‌మెంట్, నదీ జలాల సాధన, ప్రభుత్వ హామీల అమలు కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతోందని కవిత తెలిపారు. భావసారూప్యత ఉన్న పార్టీల మద్దతు కూడగడతామని చెప్పారు. తమ పార్టీ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఎన్నికల సంఘం నుంచి త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌ఛార్జులు డాక్టర్ రఘు, సయ్యద్ ఇస్మాయిల్, జిల్లాల కో-ఆర్డినేటర్లు గొంగళ్ల రంజిత్, అర్చనా సేనాపతి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp