|  
● FLASH NEWS
Panchayat: ఏపీలో స్థానిక పోరు షురూ.. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.50 లక్షల నజరానా  •  BRS: నిర్మల్ రైతు గర్జన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ దళం ఫైర్  •  HMT: హెచ్‌ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు మద్దతు.. కేంద్రంపై ఎమ్మెల్యే వివేకానంద్ ఫైర్  •  Supreme: వారసత్వ ఆస్తిలో మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు  •  Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  • 
Skip to content

Agriculture: రాష్ట్ర రైతులకు AI వ్యవసాయ సలహాలు.. కీలక ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

హైదరాబాద్, సూర్య న్యూస్ : రాష్ట్రంలోని రైతులకు ఆధునిక సాంకేతికతను చేరువ చేస్తూ వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధించేలా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI in Agriculture) ఆధారంగా రైతులకు మాతృభాష తెలుగులోనే వ్యవసాయ సలహాలు అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ (NISG) మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘భారత్ విస్తార్’ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సేవలను అన్నదాతలకు చేరువ చేయనున్నారు. ఈ అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పంటల సాగు విధానాలు, వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల నివారణ, సరైన ఎరువుల వినియోగంపై రైతులకు కచ్చితమైన సమాచారం అందుతుంది. వీటితో పాటు స్థానిక మార్కెట్ ధరలు, వివిధ ప్రభుత్వ పథకాల వివరాలను కూడా రైతులు సులభంగా తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.

రైతులకు అందుబాటులోకి టోల్ ఫ్రీ, వాట్సాప్ సేవలు

ఈ ఆధునిక సేవలను రైతులు సులభంగా, ఎప్పటికప్పుడు పొందేందుకు వీలుగా ప్రభుత్వం బహుళ మాధ్యమాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా 155261 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రత్యేక వెబ్ పోర్టల్, మొబైల్ యాప్‌తో పాటు వాట్సాప్ చాట్‌బాట్ సేవలను సైతం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp