|  
● FLASH NEWS
Cinema: పెళ్లైతే పిల్లలు కనాలా? సమాజంపై వరలక్ష్మి ఫైర్  •  VijayDeverakonda: ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయ్  •  Nobel: భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌పై సెటైర్లు  •  Bypolls: ముస్లిం మెజార్టీ స్థానాల్లో బీజేపీ హవా  •  KCR: సీఎం రేవంత్‌పై వ్యూహం మార్చిన కేసీఆర్.. టార్గెట్ కొడంగల్!  • 
Skip to content

Cinema: పెళ్లైతే పిల్లలు కనాలా? సమాజంపై వరలక్ష్మి ఫైర్

హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) పిల్లలను కనడంపై చేసిన తాజా కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. పెళ్లైన ప్రతి జంటకు కచ్చితంగా పిల్లలు ఉండాలనే రూల్ ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో (Tollywood News) పాల్గొన్న ఆమె తల్లి కాకపోవడంపై తీసుకున్న తన వ్యక్తిగత నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టారు.

తనకు పిల్లలు వద్దని వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నానని, తన భర్త కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడని వరలక్ష్మి తెలిపారు. తనకు పిల్లలు పుట్టరని కాదని, వాళ్లు కావాలనిపించడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇది తాను తీసుకున్న స్పష్టమైన, దృఢమైన నిర్ణయం అని ఆమె వివరించారు. తన భర్తకు తొలి వివాహం ద్వారా ఒక కుమార్తె ఉందని, ఆమెను తన సొంత కుమార్తెలాగే చూసుకుంటానని ఆమె చెప్పారు. అలాగే తమకు రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయని, వాటిని సైతం తన పిల్లల్లాగే భావిస్తానని వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సమాజం కోసం ఆ బాధ్యత వద్దు

పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద బాధ్యత అని, దానికి సంసిద్ధంగా లేనప్పుడు కనకపోవడమే మంచిదని వరలక్ష్మి అభిప్రాయపడ్డారు. పిల్లలను పెంచడానికి కేవలం ఆర్థికంగా స్థిరపడితే సరిపోదని, వారికి తగినంత సమయం కేటాయించడంతో పాటు తల్లిదండ్రులకు ఎంతో ఓర్పు ఉండాలని ఆమె సూచించారు. పిల్లల్ని పెంచే బాధ్యత తీసుకునేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా లేనప్పుడు, కేవలం సమాజం కోసం ఆ బాధ్యతను తీసుకోవద్దని ఆమె సూచించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp