|  
● FLASH NEWS
Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  •  EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  • 
Skip to content

Telangana Gurukula News : అన్నం అడిగితే మోకాళ్లపై నిలబెట్టిన ప్రిన్సిపాల్.. దామరచర్లలో దారుణం.. అసలేం జరిగిందంటే..

Nalgonda, Surya News: నల్గొండ (Nalgonda) జిల్లా దామరచర్ల (Damaracherla) బీసీ గురుకుల పాఠశాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనం సమయంలో అన్నం సరిపోక మళ్లీ పెట్టమని విద్యార్థినులు అడిగారు. దీనిపై ఆగ్రహించిన ప్రిన్సిపాల్ వారికి కఠిన శిక్ష విధించారు. ఎక్కువ అన్నం మరియు ఎక్కువ కూరలు హాస్టల్ లో పెట్టలేమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం వారిని రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు సుమారు గంటపాటు మోకాళ్లపై నిలబెట్టారు. భవిష్యత్తులో ఎవరైనా అన్నం సరిపోలేదని అడిగితే అందరికీ ఇదే గతి పడుతుందని ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు.

విద్యార్థినుల పట్ల పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ చర్యపై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. విద్యార్థినులను చిత్రహింసలకు గురి చేసిన సదరు ప్రిన్సిపాల్ ను తక్షణమే డిస్మిస్ (Dismiss) చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

విద్యార్థినులు మొబైల్ లో చిత్రీకరించిన వీడియో ను కింద చూడవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp