|  
● FLASH NEWS
Balapur: బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త రికార్డ్.. ఏకంగా రూ.39 లక్షలు పలికిన ప్రసాదం  •  ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత్.. ఆసియా క్రీడల్లో మరో పతకం ఖాయం!  •  Hockey: ఏషియన్ గేమ్స్‌లో జపాన్‌పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు  •  Hyderabad : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా సురేష్ గౌడ్ నియామకం  •  Supreme Court : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్..  • 
Skip to content

Warangal : కేఎంసీలో ర్యాగింగ్ కలకలం.. ఏడుగురు సీనియర్ విద్యార్థులపై వేటు!

వరంగల్, సూర్య న్యూస్: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై కాలేజీ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్‌కు చెందిన ఏడుగురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేయడంతో పాటు వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.

​ఏం జరిగిందంటే?

మార్చి 29వ తేదీ రాత్రి హాస్టల్ టెర్రస్‌పై జూనియర్ విద్యార్థులను పిలిచిన సీనియర్లు, వారికి ‘నీల్ డౌన్’, ‘ఎయిర్ చైర్’ వంటి శిక్షలు విధించినట్లు ఆరోపణలు వచ్చాయి. వాట్సాప్ మెసేజ్‌లలో తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదనే సాకుతో గంటల తరబడి జూనియర్లను వేధించినట్లు సమాచారం. దీనిపై యూజీసీ (UGC) యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

యాజమాన్యం చర్యలు:

కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సంధ్య నేతృత్వంలోని అంతర్గత విచారణ కమిటీ ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారించింది. దీని ప్రకారం:

నిందితులైన ఏడుగురు సీనియర్లను 6 నెలల పాటు అకాడమిక్స్ నుండి సస్పెండ్ చేశారు.

ఒక సంవత్సరం పాటు హాస్టల్ నుండి శాశ్వతంగా బహిష్కరించారు.

చట్టపరమైన చర్యల కోసం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp