|   
🔴 BREAKING NEWS ► TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే.. అసలు కారణం ఇదే
Skip to content

Hyderabad News : చర్లపల్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్త సంచలన ఆరోపణలు!

హైదరాబాద్, సూర్య న్యూస్: చర్లపల్లి (Cherlapally) రైల్వే ట్రాక్‌పై సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన వెనుక కేవలం మానసిక ఒత్తిడి మాత్రమే కాకుండా ఆస్తి వివాదాలు (Property Dispute) మరియు కుటుంబ సభ్యుల వేధింపులు ఉన్నాయని మృతురాలి భర్త సురేందర్ రెడ్డి సంచలన ఫిర్యాదు చేశారు.

కుటుంబ సభ్యులపైనే ఫిర్యాదు

దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న సురేందర్ రెడ్డి మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో (Medipally PS) తన అత్త పుష్పలత, బామ్మర్ది వడకళ్ల చిరంజీవి మరియు చిరంజీవి భార్య లక్ష్మీపై ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం తన భార్య పిన్నింటి విజయశాంతి రెడ్డి (38), పిల్లలు చేతన రెడ్డి (18), విశాల్ రెడ్డి (17)లను వారు తీవ్రంగా వేధించారని ఆయన ఆరోపించారు. వారి వేధింపులే తన కుటుంబాన్ని బలి తీసుకున్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆస్తి కోసం బెదిరింపులు

తన భార్య, పిల్లలు చనిపోయిన 25 రోజులకే నిందితులు తనను కూడా ఆస్తి కోసం బెదిరించారని సురేందర్ రెడ్డి వాపోయారు. ప్రస్తుతం తనకు కూడా ప్రాణహాని ఉందని, పోలీసుల రక్షణ కావాలని ఆయన కోరారు. ఒకవేళ తనకు ఏదైనా జరిగితే తన ఆస్తులన్నీ తల్లిదండ్రులకు లేదా ట్రస్టుకు చెందేలా చూస్తానని ఆయన ఫిర్యాదులో స్పష్టం చేయడం గమనార్హం.

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

గతంలో రైల్వే పోలీసులు (GRP) దీనిని డిప్రెషన్ కారణంగా జరిగిన ఆత్మహత్యగా భావించారు. అయితే సురేందర్ రెడ్డి ఫిర్యాదుతో ఆస్తి వివాదం మరియు ఆత్మహత్య ప్రేరణ (Abetment to Suicide) కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. త్వరలోనే కేసు రీ-ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp