|  
● FLASH NEWS
INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  •  Cinema : ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం  •  Quthbullapur: బహుజన వర్గాల ఐక్యతే లక్ష్యం.. సురేష్ గౌడ్‌కు ఘన సన్మానం  •  Dubai : హీరో స్మిత్‌కు ఆత్మీయంగా ముద్దుపెట్టిన దుబాయ్ ప్రిన్స్.. ప్రశంసించిన ఐఏఎఫ్ చీఫ్  •  BAPS: ఈఫిల్ టవర్ వివాదంలో బీఏపీఎస్‌కు ఊరట.. అసలేం జరిగింది?  • 
Skip to content

Bandi Bhagirath POCSO Case : బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం.. మేడ్చల్ కోర్టుకు హాజరైన బాధితురాలు

Hyderabad, Surya News:బండి భగీరథ్ (Bandi Bhagirath) పోక్సో కేసులో శనివారం ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బాధితురాలు శనివారం మేడ్చల్ కోర్టు (Medchal Court) ముందు హాజరైంది. అనంతరం మెజిస్ట్రేట్ (Magistrate) ఎదుట తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.

​ఈ వ్యవహారంలో ఇప్పటికే బాధితురాలి నుంచి పోలీసులు రెండుసార్లు వాంగ్మూలం సేకరించినట్లు సమాచారం. తాజాగా బాధితురాలితో పాటు ఆమె తల్లి స్టేట్‌మెంట్‌ను కూడా అధికారులు రికార్డు చేశారు. తన కుమార్తెను మద్యం (Alcohol) సేవించమని బండి భగీరథ్ ఒత్తిడి చేశాడని, ఆమె బలహీన స్థితిలో ఉన్న సమయంలో అనుచితంగా ప్రవర్తించాడని బాధితురాలి తల్లి ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వేధింపుల కారణంగానే తన కుమార్తె చాలా రోజుల పాటు అవమానంగా, తీవ్ర మానసిక వేదనను అనుభవించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

​ఈ కేసులో ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. నిజానిజాలు తప్పకుండా బయటకు వస్తాయని, తమ వద్ద వాట్సాప్ చాటింగ్‌లు (WhatsApp Chatting), మెసేజ్‌లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ (Electronic Communication) ఆధారాలు కూడా ఉన్నాయని బాధితురాలి తల్లి వెల్లడించింది.

మరోవైపు విచారణ నిమిత్తం హాజరుకావాలని పోలీసులు భగీరథ్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల విచారణకు భగీరథ్ హాజరుకాలేదు. ప్రస్తుతం అతని ఫోన్ స్విచ్ ఆఫ్ (Switch Off) లో ఉందని, నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భగీరథ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు (Search Operations) చేపట్టారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp